twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సైరా’ టీజర్: చరిత్ర మనతోనే మొదలవ్వాలంటూ అదరగొట్టిన మెగాస్టార్!

    |

    Recommended Video

    Sye Raa Teaser (Telugu)

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచింది. ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రం ఒక అద్భుతమైన వార్ మూవీగా ఉండబోతోందని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌తో టీజర్ విడుదల కావడం అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

    చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక్క వీరుడు...

    చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక్క వీరుడు...

    చరిత్ర స్మరించుకుంటుంది.. ఝాన్సీ లక్ష్మీ భాయి, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలను.. కానీ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక్క వీరుడు... ఆంగ్లేయులపై యుద్ధభేరి మ్రోటగించిన రేనాటి సూర్యుడు.... అంటూ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌తో సైరా టీజర్ మొదలైంది.

    అభిమానుల్లో గూస్ బంప్స్

    అభిమానుల్లో గూస్ బంప్స్

    హూ ఈజ్ దిస్ నరసింహారెడ్డి అని ఆంగ్లేయుడు అడిగిన ప్రశ్నకు.... సింహం లాంటోడు దొరా.. అతడే వాళ్ల ధైర్యం దొరా.. అంటూ వచ్చే సమాధానం అభిమానుల్లో గూస్ బంప్స్ వచ్చేలా చేసింది. ట్రైలర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    చరిత్ర మనతోనే మొదలవ్వాలి

    రేనాడు వీరులారా.. చరిత్రలో మనం ఉండకపోవచ్చు, చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి అంటూ మెగాస్టార్ చెప్పే డైలాగులు టీజర్లో హైలెట్ అయ్యాయి. ఒళ్లుగగుర్బొడిచే యాక్షన్ సీన్లతో పాటు రొమాను నిక్కబొడిచే డైలాగులు కూడా అభిమానులకు ఎంటర్టెన్ చేయబోతున్నాయి.

    సైరాలో యాక్షన్ సీన్లు ఒళ్లు గగుర్బొడిచే విధంగా

    సైరాలో యాక్షన్ సీన్లు ఒళ్లు గగుర్బొడిచే విధంగా

    ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచింది. 1857 బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ వేసి ఈ మూవీ రూపొందించారు. ఈ సెట్ల నిర్మాణం ఎలా జరిగింది అనేది ఈ మేకింగ్ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. సైరాలో యాక్షన్ సీన్లు ఒళ్లు గగుర్బొడిచే విధంగా ఉండబోతున్నాయి. యుద్ధ సన్నివేశాల చిత్రీకరించిన విధానం, దాని కోసం చిత్ర బృందం ఎంత కష్టపడిందో ఫోకస్ చేశారు. సినిమాలోని పోరాట సన్నివేశాలు బాహుబలి రేంజిలో ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది.

    సైరా నరసింహారెడ్డి

    సైరా నరసింహారెడ్డి

    సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ ప్యాన్ ఇండియా వైడ్ విడుదల కాబోతోంది.

    English summary
    Sye Raa Narasimha Reddy teaser received an excellent response. Sye Raa Narasimha Reddy based on the life of a freedom fighter from Rayalaseema, Uyyalawada Narasimha Reddy. He was an unsung hero from Kurnool who revolted against the British in 1846.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X