Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘అందుకే చిరు లెజెండ్.. వెనుక కత్తి పట్టుకొనే పాత్రైనా మోక్షం లభించినట్టే’
టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన సైరా నర్సింహరెడ్డి చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో మంగళవారం నిర్వహించారు. ఈ చిత్రంలో జాతీయ స్థాయిలో రాణించిన సినీ ప్రముఖులు పలు పాత్రల్లో కనిపించబోవడం ప్రేక్షకుల్లో ఆసక్తిని, అంచనాలను పెంచింది. సైరాలో బసిరెడ్డి పాత్రలో కనిపించనునున్న తెలుగు, హిందీ, భోజ్‌పురి ప్రేక్షకులను మెప్పించిన రవి కిషన్ ఓ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..
అమితాబ్, చిరంజీవితో కలిసి
అమితాబ్ బచ్చన్, చిరంజీవి లాంటి లెజెండ్ యాక్టర్లతో కలిసి నటించడం నా జీవితంలో మరువలేనిది. వాళ్లిద్దరూ నటీనటులు ఓ స్కూల్ లాంటి వాళ్లు. వాళ్ల నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. 1980, 90లో ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలో డ్యాన్సులు, ఫైట్లు చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇప్పటి మాదిరిగా డ్యాన్సులు, ఫైట్లు చేసే సమయంలో మోకాళ్లకు, చేతులకు రక్షణ కవచాలు (ప్యాడ్స్) లేవు.
నేలపైడ్యాన్స్ చేస్తే
కానీ 80 దశకంలో ఎలాంటి సేఫ్ గార్డ్స్ లేకుండా చిరంజీవి సార్ నేల మీద డ్యాన్స్ చేసే మోకాళ్లు కొట్టుకుపోయాయని, ఫైట్స్ సమయంలో గాయాలపాలయ్యారనే విషయం నటుడిగా నాకు స్ఫూర్తిని కలిగించే అంశం. ఇప్పుటి నటీనటులకు అనేక సాంకేతిక అంశాలు అండగా ఉంటున్నాయి. దాంతో సులభంగా చేసేస్తున్నారు. కానీ చిరంజీవి, అమితాబ్ లాంటి వాళ్లు ఎంత కష్టపడ్డారో ఊహించుకోలేని విషయం, అందుకే వాళ్లు లెజెండ్స్ అయ్యారు.
నా జీవితానికి ఇంకేం కావాలి
చిరంజీవి లాంటి లెజెండ్‌తో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా ధన్యమే. ఆయన వెనుక కత్తి పట్టుకొని నిలబడే పాత్ర చేసిన నాకు మోక్షం లభించినట్టే అంటూ రవి కిషన్ ఉద్వేగంతో అన్నారు. అంతకంటే నా జీవితానికి ఏం కావాలి. ఈ సినిమాలో బసిరెడ్డి అనే పాత్రలో కనిపిస్తాను. అద్భుతంగా సిగరెట్ తాగాను. నా పాత్రను చాలా బయటకు రాకుండా ఉంచారు. సాధారణంగా నా పాత్రలు సినిమాలో గుట్టుచప్పడు కాకుండా బాంబులా పేలుతాను. తప్పకుండా ఈ సినిమా మిమ్మల్ని విశేషంగా ఆకర్షిస్తుంది అని రవికిషన్ అన్నారు.
సైరాలో నటీనటుల గురించి
సైరా చిత్రంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించడం సెన్సేషన్‌గా మారింది. అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు లాంటి ఎందరో సినీ ప్రముఖులు సైరా చిత్రంలో భాగస్వామ్యం అయ్యారు. నయనతార చిరంజీవికి భార్యగా నటిస్తుండగా, నృత్యకారిణి లక్ష్మీగా తమన్నా నటించనున్నది. అవుకు రాజు అనే యుద్ధ వీరుడిగా కిచ్చ సుదీప్, రాజ పాండ్యన్‌గా విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు.