‘సైరా’.... అండర్ వాటర్లో చిరంజీవి ఒళ్లు గగుర్బొడిచే యాక్షన్ విన్యాసాలు!

Recommended Video

Sye Raa Narasimha Reddy Underwater Action Sequences | Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న పీరియడ్ మూవీ 'సైరా నరసింహారెడ్డి'. ఈ చారిత్రాత్మక చిత్రం రూపొందుతున్న విధానం చూస్తుంటే తెలుగు సినిమా చరిత్రలో మరో అద్భుతం త్వరలో ఆవిష్కరించబడబోతోందనే వాదనకు మరింత బలం చేకూరుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'సైరా' నెక్ట్స్ షెడ్యూల్‌లో ఒళ్లు గగుర్బొడిచే యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా నిపుణులను హైర్ చేసుకున్నారట.

అండర్ వాటర్ ఫైట్

అండర్ వాటర్ ఫైట్

‘సైరా' చిత్రానికి సంబంధించిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ అండర్ వాటర్‌లో చిత్రీకరించబోతున్నారట. ముంబైలో స్పెషల్‌గా డిజైన్ చేసిన స్విమ్మింగ్ ఫూల్‌లో ఈ ఫైట్ సన్నివేశాలు షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

నిపుణుల సమక్షంలో...

నిపుణుల సమక్షంలో...

ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసం అండర్ వాటర్ స్టంట్స్ కంపోజ్ చేసే నిపుణులను హైర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం నుంచి చిత్రీకరణ మొదలు కాబోతున్నట్లు సమాచారం.

రూ. 200 కోట్ల భారీ బడ్జెట్

రూ. 200 కోట్ల భారీ బడ్జెట్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే బిగ్ బడ్జెట్ మూవీగా ‘సైరా నరసింహారెడ్డి' రూపొందుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పాత్రలో చిరంజీవి, ఆయన భార్య సిద్ధమ్మ పాత్రలో నయనతార నటిస్తున్నారు.

బాహుబలి తర్వాత బిగ్ మూవీ

బాహుబలి తర్వాత బిగ్ మూవీ

తెలుగులో బాహుబలి తర్వాత ఆ స్థాయిలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇదే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా లాంటి స్టార్స్ సైతం ఇందులో నటిస్తున్నారు. 2019 సమ్మర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X