ముదిరిన Sye Raa వివాదం.. రామ్ చరణ్, చిరంజీవి చీటింగ్ చేశారంటూ ఆందోళన.. ఎఫ్ఐఆర్ నమోదు

రాయలసీమ తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోంది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. రామ్ చరణ్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచే అనుకోని అవాంతరాలు వెంటాడుతూ చిత్రయూనిట్‌కి తంటాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్, చిరంజీవిపై కేసు నమోదు చేయాలంటూ ఆందోళన చేపట్టారు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బంధువులు. పూర్తి వివరాలు చూస్తే..

 మా రక్తంతో కోట్లలో వ్యాపారం చేస్తున్నారంటూ

మా రక్తంతో కోట్లలో వ్యాపారం చేస్తున్నారంటూ

మా రక్తంతో కోట్లలో వ్యాపారం చేస్తున్నారంటూ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కుటుంబ సభ్యులు కొద్దీ రోజుల క్రితం కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. సినిమా కథ విషయంలో తమకు హక్కులు ఉంటాయని ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు డిమాండ్ చేయగా.. కొణిదెల ప్రొడక్షన్స్, ఉయ్యాలవాడ కుటుంబీకుల మధ్య గతంలో ఓ అగ్రిమెంట్ జరిగిందని వారు పేర్కొన్నారు.

ఆర్ధికంగా ఆదుకోవాలని రామ్ చరణ్, డైరెక్టర్ లను అడగగా

ఆర్ధికంగా ఆదుకోవాలని రామ్ చరణ్, డైరెక్టర్ లను అడగగా

తీరా విడుదల సమయం దగ్గర పడిన ఈ తరుణంలో తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థతో తమ ఆవేదన వెళ్లగక్కారు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బంధువులు. తమను చిరంజీవి, రామ్ చరణ్ చీటింగ్ చేశారని పేర్కొన్నారు. తమను ఆర్ధికంగా ఆదుకోవాలని రామ్ చరణ్, డైరెక్టర్ లను అడిగామని, అయినా న్యాయం జరగలేదని వారు చెప్పారు.

రామ్ చరణ్, చిరంజీవిలపై కేసు నమోదు చేయాలి

రామ్ చరణ్, చిరంజీవిలపై కేసు నమోదు చేయాలి

సినిమా షూటింగ్ అంతా అయిపోయాక ఇప్పుడు ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండని వారు అంటున్నారని, తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని వారు పేర్కొన్నారు. ఈ మేరకు రామ్ చరణ్, చిరంజీవిలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

లెక్క ప్రకారం 50 కోట్లు చెల్లించాలి.. ఎఫ్ఐఆర్ నమోదు

లెక్క ప్రకారం 50 కోట్లు చెల్లించాలి.. ఎఫ్ఐఆర్ నమోదు

అప్పట్లో మా కుటుంబంతో రామ్ చరణ్ స్వయంగా మాట్లాడి నోటరీపై 22 మందితో సంతకాలు చేయించారని చెప్పారు. తమకు సినిమా మార్కెట్ లో 10 శాతం వాటా రావాలని, లెక్క ప్రకారం 50 కోట్లు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి కుటుంబ సభ్యుల తరపు న్యాయవాది జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రీ రిలీజ్ వేడుక అడ్డుకుంటాం

ప్రీ రిలీజ్ వేడుక అడ్డుకుంటాం

తమకు న్యాయం చేయకుంటే సెప్టెంబర్ 22 న జరగబోయే సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకను అడ్డుకుంటామని వారు తెలిపారు. దీంతో ఈ ఇష్యు ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది.

సైరా నరసింహా రెడ్డి మూవీ

సైరా నరసింహా రెడ్డి మూవీ

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది సైరా నరసింహా రెడ్డి మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X