చిరంజీవి చెప్పింది నిజం కాదు.. రామ్ చరణ్ కరెక్ట్.. మొత్తంమీద కొలిక్కి వచ్చిన వివాదం

మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా 'సైరా నరసింహా రెడ్డి' విడుదలకు ముందే వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తమను నమ్మించి మోసం చేశారంటూ ఉయ్యాలవాడ వంశీయులు నానా హంగామా చేసి చివరకు కోర్టు వరకూ వెళ్లారు. చివరకు తమ పిటిషన్లను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు ఉయ్యాలవాడ వంశీయులు. ఈ మేరకు తమ వాయిస్ కూడా వినిపించారు. వివారాల్లోకి పోతే..

Recommended Video

Sye Raa Narasimha Reddy : Chiranjeevi Finally Responded On Sye Raa Movie Controversy !

అప్పుడు అగ్రిమెంట్.. ఇప్పుడు మోసం

అప్పుడు అగ్రిమెంట్.. ఇప్పుడు మోసం

మా రక్తంతో కోట్లలో వ్యాపారం చేస్తున్నారంటూ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కుటుంబ సభ్యులు కొద్దిరోజులుగా తీవ్ర ఆందోళనలు చేశారు. సినిమా కథ విషయంలో తమకు హక్కులు ఉంటాయని తాము డిమాండ్ చేయగా.. గతంలో కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్ చరణ్ తమతో ఓ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని, తీరా సినిమా పూర్తయ్యాక మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు.

చిరంజీవి స్పందన

చిరంజీవి స్పందన

టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా ఈ ఈ ఇష్యూపై ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి కుటుంబీకుల‌ను ఎవ‌రో ఉసిగొల్పార‌ని, ఆ ఫ్యామిలీకి చెందిన 23 కుటుంబాల వారు ఒక్కొక్క ఫ్యామిలీకి రెండు కోట్లు చొప్పున డిమాండ్ చేశార‌ని, అది సబబు కాదని చిరు అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు చాలా అమాయకులని, వారికి గానీ.. వారి ఊరికి ఏదో ఒక రకంగా సహాయ పడతామని అన్నారు చిరంజీవి.

చిరు అబద్దం.. రామ్ చరణ్ నిజం

చిరు అబద్దం.. రామ్ చరణ్ నిజం

తాజాగా ఇదే అంశంపై ఉయ్యాల‌వాడ కుటుంబ స‌భ్యులు స్పందించారు. చిరంజీవి చెప్పిన‌ట్లు తమ వంశీకులు ఒక్కొక్క కుటుంబానికి రెండు కోట్ల రూపాయ‌లు చెల్లించ‌మ‌ని అడ‌గ‌లేద‌ని అన్నారు. చిరనేజీవి అబ‌ద్ధం చెబుతున్నార‌ని అన్నారు. ఇది వ‌ర‌కు చెప్పిన‌ట్లు తాము ఒక్కొక్క కుటుంబానికి 15 ల‌క్ష‌లు ఇవ్వాలని డిమాండ్ చేసిన మాట వాస్తవమని చెప్పారు.

ఎట్టకేలకు రాజీ పడి

ఎట్టకేలకు రాజీ పడి

ఎట్టకేలకు ఉయ్యాలవాడ వంశీయులు వెనక్కి తగ్గారు. సినిమా విడుద‌ల సంద‌ర్భంగా తాము వేసిన కేసుల‌న్నీ వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లుగా ప్రకటించారు. దీంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఎలాగోలా మొత్తంమీద వివాదం సద్దుమణగటం మెగా అభిమానులను ఖుషీ చేస్తోంది.

సైరా నరసింహా రెడ్డి మూవీ

సైరా నరసింహా రెడ్డి మూవీ

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X