బెంగళూరు ప్రేక్షకులకు సైరా విందు.. అక్కడ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఇదిగో వివరాలు
విడుదలకు ముందే సైరా టీం తెగ సందడి చేస్తోంది. పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతూ స్పెషల్ ట్రీట్ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్రయూనిట్.. ఇక బెంగళూరుకు ప్రయాణమైంది. అక్కడి ప్రేక్షకులను కూడా కనువిందు చేయాలని సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది.
సెప్టెంబర్ 29 వ తేదీన ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. నాగవార ప్రాంతంలోని మాన్యత టెక్ పార్క్ ప్రాంతంలో భారీ ఎత్తున ఈ వేడుక జరగనుందని సమాచారం. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఈ ఈవెంట్ స్టార్ట్ చేస్తామని ప్రకటించారు. దీంతో బెంగళూరు ఆడియన్స్‌లో సైరా నరసింహా రెడ్డి సినిమా పట్ల, ఈ ఈవెంట్ పట్ల ఆత్రుత నెలకొంది.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగుతో పాటు ఇతర నాలుగు భాషల్లోనూ సైరా నరసింహా రెడ్డి విడుదల కానున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు యూనిట్ సభ్యులు. దీంతో ప్రతిష్టాత్మక చిత్రంపై రోజు రోజుకూ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. అక్టోబర్ 2 తర్వాత ఈ సినిమా సరికొత్త సంచలనాలకు తెరలేపడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











