సైరా థియేటర్స్‌పై దాడులు! లెక్కలు తేలాయా? రామ్ చరణ్ ఒప్పందమేంటి?

రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఆశించిన మేర కలెక్షన్స్ రాబడుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఇంతలో 'సైరా నరసింహా రెడ్డి' సినిమా నడిపించే థియేటర్స్ పై టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడులు జరగడం ఫిలింనగర్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు చూస్తే..

పక్షం దాటినా సై సైరా అంటూ..

పక్షం దాటినా సై సైరా అంటూ..

తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమాను అక్టోబర్ 2వ ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. మొదటి షోతోనే సక్సెస్ టాక్ రావడం, దసరా సెలవులు కలసి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో సైరా హవా బాగా కనిపించింది. ఈ క్రమంలో 15 రోజులైనా నేటికీ సైరా హంగామా ఆగడం లేదు.

 ఇంతలో షాక్.. సైరా థియేటర్స్‌పై దాడులు

ఇంతలో షాక్.. సైరా థియేటర్స్‌పై దాడులు

ఇంతలో 'సైరా' ప్రదర్శించబడుతున్న థియేటర్లపై జీఎస్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది. జీఎస్టీ విషయంలో చాలా పక్కాగా ఉంటున్న కేంద్ర ప్రభుత్వం సైరా థియేటర్స్‌పై కన్నేసింది. ఈ మేరకు లెక్కలు తేల్చడానికి టాస్క్‌ఫోర్స్ అధికారులు సైరా థియేటర్లలో సోదాలు నిర్వహించారు.

టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడి.. కారణం

టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడి.. కారణం

జీఎస్టీని పక్కాగా చెల్లించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించేందుకు గాను టాస్క్‌ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని పలు థియేటర్లలో అధికారుల సోదాలు జరిగాయని తెలిసింది. అయితే, అధికారులకు అక్కడ ఎలాంటి సమాచారం లభించిందనేది తెలియరాలేదు.

 రామ్ చరణ్ ఒప్పందం.. అలా అయితే

రామ్ చరణ్ ఒప్పందం.. అలా అయితే

రామ్ చరణ్ సైరా బయ్యర్ల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కలెక్షన్లు బ్రేక్ ఈవెన్ ఫిగర్‌ను దాటేంత వరకు నిర్మాత రామ్ చరణ్ జీఎస్టీని చెల్లించాల్సి ఉందట. సినిమా లాభాల బాట పట్టాక పాఇప్పుడు బయ్యర్లు జీఎస్టీ చెల్లించాలి. ప్రస్తుతానికి నైజాం, ఉత్తరాంధ్రలో సైరా బ్రేక్ ఈవెన్ దాటేసింది. మిగిలిన చోట్ల దగ్గరలో ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కలిపి సైరా నరసింహా రెడ్డి సినిమా 100 కోట్ల మార్క్ రీచ్ అయిన సంగతి తెలిసిందే.

ఇంతకీ సైరాకు అనుకూలమా? ప్రతికూలమా?

ఇంతకీ సైరాకు అనుకూలమా? ప్రతికూలమా?

సైరా థియేటర్స్‌లో జీఎస్టీ లెక్కలు బయటకు తీయడం అనుకూలమా, ప్రతికూలమా అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఒక్క తూర్పుగోదావరి జిల్లా లోనే ఈ దాడులు జరిగాయా? లేదా ఇంకా మరిన్ని చోట్ల జరిగాయా? అనేది కూడా క్లారిటీకి రావాల్సిన విషయం. గతంలో 'సాహో' విషయంలోనూ ఇలాంటి దాడులే జరిగాయని, కానీ అవి బయటకు రాలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X