అంతకంతకూ పెరిగిపోతున్న 'సైరా' రేంజ్.. అవేవీ అడ్డు కాదన్నట్లుగా రికార్డు స్థాయి రిపోర్ట్స్

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' సినిమా రేంజ్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఓ వైపు ప్రమోషన్స్, మరోవైపు పెద్దఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్‌తో విడుదలకు ముందే ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. 'సైరా' థియేటర్స్‌కి సంబంధించి, ప్రీ రిలీజ్ బిజినెస్‌‌కి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ ట్రేడ్ వర్గాలకే షాకిచ్చేవిగా ఉన్నాయి. ఆ వివరాలేంటో చూద్దామా..

భారీ డిమాండ్.. ఒక్క తెలుగులోనే కాదు!

భారీ డిమాండ్.. ఒక్క తెలుగులోనే కాదు!

అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ మేరకు సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ మరింత ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా సైరా స్క్రీన్స్‌కి సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. తెలుగుతో పాటు హిందీ వర్షన్ లోనూ ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడటంతో థియేటర్ల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది.

హిందీలో ఆ ఎఫెక్ట్ పడుతుందనుకున్నారు.. కానీ

హిందీలో ఆ ఎఫెక్ట్ పడుతుందనుకున్నారు.. కానీ

అదే అక్టోబర్ 2వ తేదీన హిందీలో కమర్షియల్ మాస్ మూవీ 'వార్' భారీ ఎత్తున విడుదల కానుంది. సో ఆ ఎఫెక్ట్ 'సైరా' హిందీ వర్షన్‌పై పడొచ్చని అంతా భావించారు. కానీ హిందీ వర్షన్ సైరా ట్రైలర్ సృష్టించిన సంచలనం సినిమాకి భారీ హైప్ తీసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా 'సైరా' సినిమాపై డిమాండ్ ఏర్పడింది.

ఏకంగా 2000 థియేటర్స్

ఏకంగా 2000 థియేటర్స్

హిందీలో సైరా డిమాండ్ చూసి అక్కడి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎక్సెల్ వారు థియేటర్స్‌ని మెల్లిమెల్లిగా పెంచుతూ పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన థియేటర్స్ సంఖ్య 1400. డిమాండ్ దృష్ట్యా మరో రెండు రోజుల్లో ఈ కౌంట్ 1800 నుండి 2000 వరకు వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది.

భారీ ప్రీ రిలీజ్ బిజినెస్.. రికార్డుల సునామీకి తొలిమెట్టు

భారీ ప్రీ రిలీజ్ బిజినెస్.. రికార్డుల సునామీకి తొలిమెట్టు

ఇక సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మేర థియేట్రికల్, శాటిలైట్ రైట్స్ రూపంలో బిజినెస్ చేసిందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సైరా థియేట్రికల్ రైట్స్ 108.6 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓ తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం రికార్డుల సునామీకి తొలిమెట్టు అంటున్నారు విశ్లేషకులు.

టీజర్, ట్రైలర్ సెన్సేషన్.. సెన్సార్

టీజర్, ట్రైలర్ సెన్సేషన్.. సెన్సార్

సైరా నరసింహా రెడ్డి సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవి సోషల్ మీడియాలో వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులకు తెరలేపుతూ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి. ఇక సైరా చూసిన సెన్సార్ సభ్యులు సింగిల్ కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ అందించారు.

సైరా నరసింహా రెడ్డి మూవీ

సైరా నరసింహా రెడ్డి మూవీ

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X