సెప్టెంబర్ 22నే సైరా ప్రీరిలీజ్ వేడుక ఎందుకు? మెగా సెంటిమెంట్ మీకు తెలుసా?
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డి చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్దమైంది. అక్టోబర్ 2 సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా సెప్టెంబర్ 22వ తేదీన ఈవెంట్‌ను నిర్వహించేందుకు కొణిదెల ప్రొడక్షన్ నిర్ణయం తీసుకొన్నది. అయితే ఈ తేదీకి అత్యంత ప్రాముఖ్యత ఉండటం గమనార్హం.

సెప్టెంబర్ 22వ తేదీన
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిరంజీవి నటుడిగా సెప్టెంబర్ 22వ తేదీన తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురులేకుండా తన సినీ ప్రస్థానాన్నికొనసాగించారు. తన ప్రతిభతో అంచెలంచెలుగా డైనమిక్, డేరింగ్, డాషింగ్ హీరోగా, సుప్రీం హీరోగా, మెగాస్టార్‌గా చిరంజీవి ఎదిగాడు.

నటుడిగా 41వ జన్మదినం
చిరంజీవి నట జీవితంలో సెప్టెంబర్ 22వ తేదీ అత్యంత ప్రాముఖ్యం ఉంది. ఆయన నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు ఇదే తారీఖున 1978లో రిలీజైంది. ఆ సినిమాతోనే ఇండస్ట్రీలో పునాది రాళ్లు వేసుకొన్నారు. దాంతో నటుడిగా ఆయన ఈ రోజు 41వ జన్మదిన చిరంజీవి జరుపుకొంటున్నారు.

100వ చిత్రం కూడా
ఇక చిరంజీవి కెరీర్‌లో 100 చిత్రం త్రినేత్రుడు. ఆ చిత్రం కూడా సెప్టెంబర్ 22వ తేదీ 1988లో విడుదలైంది. త్రినేత్రుడు సినిమా మెగాస్టార్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఇలా ప్రత్యేకమైన తేదీనే సైరా ప్రిరిలీజ్ వేడుకకు ముహుర్తం సెట్ అయింది.

సైరా వేడుక కూడా ఇదే తేదీనే
ఇక సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సెప్టెంబర్ 22న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కనివినీ ఎరుగని రీతిలో జరుపనున్నారు. ఈ వేడుక కోసం పవన్ కల్యాణ్, కొరటాల శివ, రాజమౌళి, వీవీ వినాయక్ తదితరులు హాజరుకానున్నారు. అయితే ఈ వేడుక తర్వాతనే అసలు ప్రమోషన్‌ను దద్దరిల్లేలా చేపట్టేందుకు నిర్మాత రాంచరణ్ ప్లాన్ చేసినట్టు యూనిట్ వెల్లడిస్తున్నది.

సైరాలో దిగ్గజాలు
ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న సైరా చిత్రంలో ఎంతో మంది దిగ్గజ నటులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్, మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, లేడీ సూపర్ స్టార్ నయనతార, తమన్నా, జగపతి బాబు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ మూవీకి రత్నవేలు సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











