కనీవినీ ఎరుగని రీతిలో ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్... చీఫ్‌గెస్ట్ ఎవరో తెలుసా?

ఒక మంచి సినిమా తీయడం ఎంత ముఖ్యమో... దానికి ప్రచారం కల్పించడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే ఆ సినిమా ప్రజల్లోకి వెళుతుంది, వారిలో ఆ సినిమా చూడాలనే ఆసక్తి కలుగుతుంది. అందుకే త్వరలో విడుదల కాబోతున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రానికి ప్రమోషన్స్ కోసం నిర్మాత రామ్ చరణ్ ప్రత్యేకంగా ఓ టీమ్ ఏర్పాటు చేశారు. వందల కోట్లు పెట్టి రూపొందిస్తున్న చిత్రం, ప్యాన్ ఇండియా వైడ్ విడుదలకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో పబ్లిసిటీ విషయంలో ఎక్కడా కూడా తగ్గడం లేదు. త్వరలో జరుగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కూడా రామ్ చరణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్

‘సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో గ్రాండ్‌గా జరిగిన ఈవెంట్లలో ఒకటిగా సైరా ప్రీ రలీజ్ ఈవెంట్ నిలుస్తుందని, ఈ మేరకు ఇప్పటి నుంచే ప్లానింగ్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.

చీఫ్ గెస్టులుగా ఎవరంటే...

చీఫ్ గెస్టులుగా ఎవరంటే...

ఈ భారీ వేడుకు ముఖ్య అతిథులుగా పవన్ కళ్యాణ్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు రాజమౌళి, కొరటాల శివ, వివి వినాయక్ రాబోతున్నారు. రామ్ చరణ్ ఈ వేడుకకు తనకు అత్యంత సన్నిహితుడైన తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించినప్పటికీ అధికారిక పనుల వల్ల రాలేకపోతున్నారట. ఈ విషయాన్ని వెల్లడిస్తూ కొణిిదెల ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది.

భారీ సంఖ్యలో మెగా అభిమానులు

భారీ సంఖ్యలో మెగా అభిమానులు

అసలే చిరంజీవి సినిమాకు సంబంధించిన కార్యక్రమం, అందులోనూ పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే.... మెగా అభిమానుల్లో ఉత్సాహం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల విడుదలైన సైరా టీజర్‌కు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు.

రొమాలు నిక్కబొడిచేలా పవన్ ప్రసంగం

రొమాలు నిక్కబొడిచేలా పవన్ ప్రసంగం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో తన ప్రసంగంతో ఆకట్టుకోబోతున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ స్టేజీపై మాట్లాడటానికి చాలా సిగ్గుపడేవారు. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పూర్తిగా మారిపోయారు. స్టేజీ ఎక్కారంటే తన ప్రసంగాలతో అదరగొడుతున్నారు. ‘సైరా' వేడుకలో కూడా అభిమానుల రోమాలు నిక్కబొడిచేలా పవన్ స్టార్ ప్రసంగించబోతున్నారట.

సైరా నరసింహారెడ్డి

సైరా నరసింహారెడ్డి

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ తన సొంత బేనర్ ‘కొణిదెల ప్రొడక్షన్స్' పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు రూ. 270 కోట్లు ఖర్చు పెట్టినట్లు టాక్. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, నయనతార, తమన్నా తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అక్టోబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read more about: pawan kalyan chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X