‘సైరా’ టీంను పరుగులు పెట్టించిన నయనతార... 3 రోజులే!

Recommended Video

Syeraa Narasimha Reddy : Nayan Makes Inconvenient To Sye Raa’s Team | Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.... ఉయ్యాలవాడ భార్య పాత్రను నయనతార పోషిస్తోంది.

అయితే తాజా షెడ్యూల్‌లో హీరోయిన్ నయనతార 'సైరా' టీమ్ మొత్తాన్ని పరుగులు పెట్టించిన వైనం చర్చనీయాంశం అయింది. దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గర నుంచి సెట్లో ఉండే ప్రతి టెక్నీషియన్ ఓవర్ టైమ్ పని చేయాల్సి వచ్చిందట.

3 రోజులు మాత్రమే...

3 రోజులు మాత్రమే...

ఇతర సినిమాల కమిట్మెంట్స్ ఉండటంతో నయనతార ఈ షెడ్యూల్‌లో సైరా టీంకు మూడు రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చిందట. ఈ మూడు రోజుల్లో ఆమెపై చిత్రీకరించాల్సిన సీన్లు పూర్తి చేయడానికి చిత్ర బృందం చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలుస్తోంది.

చిరు, నయనపై కీలక సీన్లు

చిరు, నయనపై కీలక సీన్లు

చిరంజీవి, నయనతార కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఈ షెడ్యూల్‍‌లో చిత్రీకరించారు. అయితే ఈ సీన్ల ఔట్ పుట్ అద్భుతంగా రావడంతో మూడు రోజులు రెస్ట్ లేకుండా పని చేసిన ‘సైరా' టీం మొత్తాన్ని చిరంజీవి మెచ్చుకున్నారట.

తెలుగులో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్

తెలుగులో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్

తెలుగులో బాహుబలి తర్వాత ఆ స్థాయిలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇదే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా లాంటి స్టార్స్ సైతం ఇందులో నటిస్తున్నారు.

సమ్మర్లో గ్రాండ్ రిలీజ్

సమ్మర్లో గ్రాండ్ రిలీజ్

కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. 2019 సమ్మర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X