‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ అందుకే ఆలస్యం, పెరుగుతున్న ఖర్చు... దసరా డెడ్ లైన్!

Recommended Video

Reason Behind Delay In Sye Raa Narasimha Reddy Shoot

మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం మొదలవ్వడమే ఆలస్యంగా మొదలైంది. షూటింగ్ ప్రారంభమైన తర్వాత అనేక సమస్యలు. దీంతో చిత్రీకరణ అనుకున్న సమాయానికి పూర్తి కావడం లేదు. రీ షూట్లు, తప్పని పరిస్థితుల్లో షెడ్యూల్స్ వాయిదా వేయడం లాంటి చర్యలే ఇందుకు కారణని అంటున్నారు.

ప్రస్తుతం షూటింగ్ జరిగేది ఎక్కడంటే..

ప్రస్తుతం షూటింగ్ జరిగేది ఎక్కడంటే..

ఎట్టకేకు ‘సైరా' టీం మేజర్ టాకీ పార్ట్ పూర్తి చేశారు. అయితే సినిమాలో పూర్తి చేయాలని కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉండటంతో అందుకోసం షూటింగ్ షెడ్యూల్ పొడగించక తప్పలేదు. ప్యాచ్ వర్క్ షూటింగ్ మైలారం విలేజ్, కోకాపేట్, వికారాబాద్ అడవుల్లో ప్లాన్ చేశారు. మరికొన్ని రోజుల్లో టోటల్ షూటింగ్ పార్ట్ పూర్తి కాబోతోంది.

దసరాకు రిలీజ్ చేయడమే టార్గెట్

దసరాకు రిలీజ్ చేయడమే టార్గెట్

‘సైరా' చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాసరా సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ పార్ట్ దాదాపుగా చివరి దశకు చేరుకోవడంతో ఆ తర్వాత జరిగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తయిన భాగానికి సంబంధించి ఆల్రెడీ విజువల్ ఓఫెక్ట్స్, ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయి.

వరల్డ్ క్లాస్ విజువల్స్

వరల్డ్ క్లాస్ విజువల్స్

‘సైరా' చిత్రంలోని విజువల్స్ వరల్డ్ క్లాస్‌‌లా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమా అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువ ఖర్చవుతున్నా... క్వాలిటీ విషయంలో తేడా రాకుండా చూడాలని నిర్మాత చరణ్ ఆల్రెడీ తన టీంకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇందు కోసం విదేశీ టెక్నిషన్ సహాయం తీసుకుంటున్నారు.

పెర్ఫెక్షన్ కోసం తపిస్తున్న సురేందర్ రెడ్డి

పెర్ఫెక్షన్ కోసం తపిస్తున్న సురేందర్ రెడ్డి

సురేందర్ రెడ్డి ‘సైరా' చిత్రం ఎంతో ప్రతిష్టాత్మం. ఈ సినిమా ఫలితం మీదే అతడి సినీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతీ సీన్ పెర్ఫెక్షన్ కోసం అతడు చాలా తపిస్తున్నాడు. సినిమా మొదలైనప్పటి నుంచి అన్నీ వదిలేసి షూటింగే తన ప్రపంచంగా బ్రతుకుతున్నాడని టాక్.

సైరా నరసింహారెడ్డి

సైరా నరసింహారెడ్డి

ప్యాన్ ఇండియా మూవీగా ‘సైరా'ను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో భారీ తారాగణం ఎంపిక చేశారు. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ఈ చిత్రం భారీగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X