‘సైరా’ శాటిలైట్, డిజిటల్ రైట్స్ కేక... సగం పెట్టుబడి రాబట్టిన రాంచరణ్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రాంచరణ్ నిర్మిస్తున్న చారిత్రక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి, సాహో తర్వాత అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇదే.

స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గళంవిప్పి తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో తొలిసారి ఇలాంటి హిస్టారికల్ బయోపిక్ మూవీలో నటిస్తున్నారు.

ప్యాన్ ఇండియా స్థాయిలో

ప్యాన్ ఇండియా స్థాయిలో

‘సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని కేవలం టాలీవుడ్‌కే పరిమితం చేయకుండా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు, విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Recommended Video

Sye Raa Narasimha Reddy Climax Sequence Revealed || మెగా అభిమానులకు షాక్
శాటిలైట్, డిజిటల్ హక్కులకు భారీగా డిమాండ్

శాటిలైట్, డిజిటల్ హక్కులకు భారీగా డిమాండ్

కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై దాదాపు రూ. 270 కోట్ల భారీ బడ్జెట్‌తో రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ నటిస్తున్న సినిమా కావడం, అన్ని భాషల్లో వస్తుండటంతో శాటిలైట్, డిజిటల్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. వీటిరూపంలో పెట్టుబడిలో దాదాపు సగం మేర రికవరీ అయినట్లు తెలుస్తోంది.

సగం పెట్టుబడి ఈ రూపంలోనే

సగం పెట్టుబడి ఈ రూపంలోనే

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘సైరా' శాటిలైట్ రైట్స్, డిజిటైల్ రైట్స్ రెండూ కలిపి రూ. 125 కోట్ల ధరకు జీ నెట్వర్క్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు సగం పెట్టుబడి ఈ రూపంలో రావడం నిర్మాతకు ఊరటనిచ్చే అంశం.

సైరా థియేట్రికల్ రైట్స్

సైరా థియేట్రికల్ రైట్స్

ఇక ‘సైరా' మూవీ తెలుగు వెర్షన్ థియేట్రికల్స్ రైట్సే దాదాపు రూ. 110 కోట్లకుపైగా అమ్ముడైనట్లు సమాచారం. ఇక హిందీ, తమిళం, మలయాళం, కన్నడ రైట్స్, ఓవర్సీస్ రైట్స్ అన్నీ కలిపితే భారీ ఆదాయం ఖాయమని స్పష్టమవుతోంది.

సైరా

సైరా

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు నయనతార, జగపతి బాబు, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది పాటలకు సంగీతం అందించగా, జూలియస్ ప్యాకియం బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X