‘సై రా’... ఆలస్యంపై చింత వద్దు, పూర్తి కాన్ఫిడెంటుతో చెర్రీ-సూరి!
సై రా నరసింహా రెడ్డి సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ నుండి తాజా అప్డేట్ వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం 'సై రా... నరసింహా రెడ్డి'. ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం అక్టోబర్ 20 తేదీనే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. అయితే పలు కారణాలతో ఇంకా సెట్స్ మీదకు వెళ్లకపోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
Recommended Video

సినిమా షూటింగ్ మొదలు కావడానికి ముందే సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ స్థానంలో.... రత్నవేలు రీప్లేస్ కావడం కూడా అభిమానులను మరింత అయోమయం, గందరగోళంలో పడేసింది. అయితే షూటింగ్ అనుకున్న సమయానికి ప్రారంభం కాలేదని చింత వద్దని... నిర్మాత రామ్ చరణ్ సన్నిహితులు అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కాస్త లేటు కావడం వల్లే సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదని అంటున్నారు.

డిసెంబర్లో షూటింగ్ ప్రారంభం
డిసెంబర్లో సినిమా సెట్స్ మీదకు వెలుతుందని, ఇకపై ఎలాంటి తప్పిదాలు జరుగకుండా సినిమా షెడ్యూల్స్ అన్ని అనుకున్న సమయానికి మొదలవుతాయని, ఇకపై అంతా పర్ ఫెక్టుగా జరిగేలా దర్శకుడు సురేందర్ రెడ్డి ప్లాన్ చేశారని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

పూర్తి కాన్ఫిడెంటుతో రామ్ చెర్రీ-సూరి
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాను 2019 సంక్రాంతి నాటికి థియేటర్లలోకి తీసుకొస్తామనే పూర్తి కాన్ఫిడెంటుతో ఉన్నారని, సినిమా ఆలస్యం కావడానికి సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ ప్రాజెక్టు నుండి బయటకు వెళ్లి పోవడం కూడా ఓ కారణమని అంటున్నారు.

రెహమాన్ కంటిన్యూ
సంగీత దర్శకుడిగా రెహమాన్ తప్పుకున్నారు అనడంలో ఎలాంటి నిజం లేదని.... రవి వర్మన్ స్థానంలో రత్నవేలు కొత్తగా ఈ ప్రాజెక్టులోకి రావడంతో ఆయనకు సినిమా స్క్రిప్టు గురించి బ్రీఫ్ గా వివరిస్తున్నారని, తన విజన్లో సినిమాటోగ్రఫీ ప్లాన్ చేసుకోవాలి కాబట్టి దానికి కొంత సమయం పడుతుందని, అందుకే సినిమా కాస్త ఆలస్యం అవుతుందని, సెట్స్ అనుకున్న సమయానికి పూర్తి కాక పోవడం కూడా మరో కారణమని.... డిసెంబర్లో సినిమా సెట్స్ మీదకు వెలుతుందని అంటున్నారు.

నయనతార ఖరారు
ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార ఖరారైంది. అయితే సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లను కూడా తీసుకోనున్నారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











