సైరా మరో సెన్సేషన్.. సినీ చరిత్రలో అత్యంత భారీగా తీసిన పాట.. రాంచరణ్ పక్కా ప్లాన్‌తో రిలీజ్
తొలి స్వతంత్ర్య సమరయోధుడు రేనాటి వీరుడైన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సైరా తెలుగు నాట సంచలనం సృష్టించింది. చిరంజీవీ ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన ఈ సైరా.. ఎన్నో ప్రత్యేకతలతో రూపు దిద్దుకుంది. అత్యంత భారీ ఎత్తున తెరకెక్కించిన ఈ చిత్రం టాలీవుడ్‌లో ఎంతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ప్రశసంలు కురిపించిన సినీ పరిశ్రమ
టాలీవుడ్ సినీ దిగ్గజాలు సైరాను ప్రశంసలతో ముంచెత్తారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకధీరుడు రాజమౌళి, యువ దర్శకులు, హీరోలు, ప్రముఖ నిర్మాతలు ఇలా ప్రతీ ఒక్కరూ సైరాను వీక్షించి చిత్రబృందాన్ని అభినందించారు. కేవలం టాలీవుడ్ నుంచే కాక ఇతర పరిశ్రమల ప్రముఖులు సైతం సైరాను కొనియాడారు.

రాజకీయ ప్రముఖులు మెచ్చిన సైరా..
సైరా చిత్రానికి కేవలం సినీ పరిశ్రమ నుంచే కాదు రాజకీయ రంగం నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి ప్రముఖులు సినిమాను వీక్షించి.. ప్రతీ ఒక్క భారతీయుడు చూడదగ్గ గొప్ప దేశభక్తి సినిమా అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.

ప్రతీ పాత్రకు అద్భుతమైన స్పందన..
సైరాలో నటించిన ప్రతీ ఆర్టిస్ట్, ప్రతీ క్యారెక్టర్‌కు మంచి స్పందన వచ్చింది. వీరా రెడ్డిగా చేసిన జగపతి బాబు, అవుకు రాజుగా చేసిన కిచ్చా సుదీప్, రాజా పాండీగా చేసిన విజయ్ సేతుపతి, గోసాయి వెంకన్న పాత్రను ధరించిన అమితాబ్, సిద్దమ్మ పాత్రలో నయన తార, లక్ష్మీ క్యారెక్టర్‌ను పోషించిన తమన్నా ఇలా ప్రతీ ఒక్క క్యారెక్టర్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు.

టెక్నికల్‌గా మరో లెవెల్..
కథ, కథనం, నటీనటులు ఇదంతా ఒకెత్తు అయితే ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీమ్ మరో ఎత్తు. అద్భుతమైన సంగీతం అందించిన అమిత్ త్రివేది, నాటి కాలాన్ని తెరపై ఆవిష్కరించిన రత్నవేలు కెమెరా, రాజుల కోటలను కళ్లకు కట్టినట్లు చూపించిన రాజీవన్ ఆర్ట్ పనితనం ఇలా ప్రతీ ఒక్కటి సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి.

రూ. 8కోట్లతో ఓ సాంగ్..
ఈ చిత్ర ప్రమోషన్స్‌లో చెప్పినట్లు.. ఈ సినిమాలో సాంగ్స్‌ను ఇరికించాలని చూడలేదు.. సందర్భానుసారంగా వచ్చేట్టుగా పాటలను పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సైరా కోసం మరికొన్ని పాటలకు ట్యూన్స్ కట్టామని, వాటిని కూడా చిత్రీకరించామని యూనిట్ పేర్కింది. దాదాపు రూ.8 కోట్లతో ఓ సాంగ్‌ను షూట్ చేసినట్లు.. అది సినీ చరిత్రలో అత్యంత భారీ ఎత్తున చిత్రీకరించినట్లు ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ పాటను కనీసం యూట్యూబ్‌లోనైనా రిలీజ్ చేయండి.. లేదా సినిమాలో యాడ్ చేయండని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి ఫ్యాన్స్ కోరికను మేకర్స్ మన్నిస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











