‘సై రా’.... అమితాబ్ గురించి షాకింగ్ న్యూస్, ఖండించిన మేనేజర్!

By Bojja Kumar

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. అనుకున్న సమయం కంటే ఈ చిత్రం షూటింగ్ కాస్త లేటుగా మొదలైనా.... దర్శకుడు సురేందర్ రెడ్డి వేగంగా తొలి షెడ్యూల్ పూర్తి చేశారు. ఫిబ్రవరి నుండి రెండో షెడ్యూల్ మొదలు కానుంది.

Recommended Video

Sye Raa Narasimha Reddy faces trouble ‘సై రా’... ఈ వార్తలేంట్రా
 మరో షాక్ అంటూ ప్రచారం

మరో షాక్ అంటూ ప్రచారం

ఇప్పటికే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకడు ఏఆర్ రెహమాన్, సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ హ్యాండిచ్చి షాకిచ్చారు. తాజాగా మరో షాక్, అమితాబ్ ఈ చిత్రంలో నటించడం లేదంటూ ప్రముఖ పత్రికలకు సంబంధించి వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి.

ఖండించిన మేనేజర్

ఖండించిన మేనేజర్

ఈ ఫేక్ వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేయడంతో వెంటనే కొణిదెల ప్రొడక్షన్స్ డిజిటల్ పిఆర్ మేనేజర్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని, ఇవి పూర్తిగా ఆధారం లేని వార్తలే అని, అమితాబ్ బచ్చన్ త్వరలో జరిగే షెడ్యూల్స్‌లో పాల్గొంటారని మేనేజర్ ప్రవళ్లిక తెలిపారు.

 గురువు పాత్రలో అమితాబ్

గురువు పాత్రలో అమితాబ్

ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ తొలిసారి తెలుగు సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన చిరంజీవి గురువు పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అమితాబ్ పాత్ర ఇందులో ఎంతో కీలకంగా ఉంటుందని సమాచారం.

 చిరంజీవి డ్రీమ్

చిరంజీవి డ్రీమ్

చిరంజీవి కెరీర్లో ఎన్నో పాత్రలు చేసినా.... భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర సమరయోధుడి పాత్ర చేయలేదనే ఓ వెలితి ఉంది. ఎప్పటి నుండి ఇలాంటి సినిమా చేయాలని చిరంజీవి అనుకున్నా వీలు కాలేదు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఎంతో నచ్చడంతో.... ‘సైరా నరసింహారెడ్డి' పేరుతో డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకుంటున్నారు.

 జాతీయ స్థాయిలో

జాతీయ స్థాయిలో

‘సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అందుకు తగిన విధంగానే ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో తీస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. సినిమాకు ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చవుతుందని, రూ. 100 నుండి 150 కోట్ల వరకు ఖర్చయినా భరించేందుకు నిర్మాత రామ్ చరణ్ ప్రిపేర్ అయ్యారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X