చిరంజీవి దొంగ ఏంటి?.. అందుకే రాంచరణ్‌ను రెచ్చగొట్టాం.. పరుచూరి

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సైరా చిత్రం విజయ యాత్ర చేస్తున్నది. అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ల సునామీ వైపు దూసుకెళ్తున్నది. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ రాంచరణ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో థ్యాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రాంచరణ్, తమన్నా, జగపతిబాబు, పరుచూరి బ్రదర్స్, బుర్రా సాయిమాధవ్ తదితరులు...

 మూడు గంటల్లో ఖైదీ కథ

మూడు గంటల్లో ఖైదీ కథ

నాకు, చిరంజీవి గారికి క్రితం జన్మలో ఏదో రుణానుబంధం ఉంది. ఓ ప్రొడ్యూసర్ వచ్చి ఒకరోజులో కథ రాయకపోతే డేట్స్ పోతాయి అని అంటే.. మూడు గంటల్లో చిరంజీవికి కథ రాశాం. ఎవడైనా ఇప్పటి వరకు రాశాడా? మేము రాశాం. అది మా గొప్ప కాదు. హీరో మాతో రాయించాడే అదే గొప్పదనం. అలా మూడు గంటల్లో ఖైదీ సినిమా కథ రాశాం. చిరంజీవికి వినిపిస్తే బాగుందని అన్నారు.

అన్ని దొంగలు మావే

అన్ని దొంగలు మావే

ఖైదీ నుంచి మా ప్రయాణం సుదీర్ఘంగా సాగింది. ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్.. దొంగ టైటిల్‌తో దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ లాంటి సినిమాలు రాశాం. దొంగేటి.. ఇంకా గొప్పగా రాయాలని ఇంద్ర.. ఇంద్రసేనారెడ్డి కథను రాశాం. నాగబాబు కోరిక మేరకు కామెడీతో బావగారు బాగున్నారా సినిమా కూడా రాశాం. ఇన్ని సినిమాల తర్వాత చరిత్రలో చిరంజీవి నిలిచిపోయేలా సినిమా తీయాలి అని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు.

 చరిత్రలో నిలిచేలా రాంచరణ్‌ను రెచ్చగొట్టి

చరిత్రలో నిలిచేలా రాంచరణ్‌ను రెచ్చగొట్టి

చిరంజీవి చరిత్రలో నిలిచే సినిమాలో చేయడానికి రాంచరణ్‌ను రెచ్చగొట్టాలనుకొన్నాం. అప్పుడు రాంచరణ్‌ను కలిసి మీ నాన్న గొప్పవాడు కావాలంటే గొప్ప సినిమా తీయాలని అన్నాం. ఆ సినిమా ఎంత ఖర్చు అయినా మీరు తీయాలన్నాం. అందుకే ఏం కథ ఉందని అడిగితే.. ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి కథ చెప్పాం. ఆ కథ వినగానే రాంచరణ్‌కు నచ్చేసింది. ఆ తర్వాత చిరంజీవి కూడా నచ్చేసింది.

అందుకే ఇంత సంచలనం..

అందుకే ఇంత సంచలనం..

ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పాత్రకు చిరంజీవి కరెక్ట్‌గా సరిపోతాడు. అలాంటి కథలో నటింపజేయాలని మేము నిర్ణయించుకొన్నాం. ఓ దేశభక్తుడు ఆంగ్లేయులను ఎదురించాడు. ఆ కథ కేవలం చిరంజీవి మాత్రమే సరిపోతారు అనుకొన్నారని తీశాం. అందుకే ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ పాత్ర లభించడం వల్లే చిరంజీవి అంత అందంగా కనిపిస్తున్నాడు.

సైరా వీరత్వం అంటూ

సైరా వీరత్వం అంటూ

గాంధీ లాంటి సినిమాలు చూశాం. అందులో కరుణరసం ఉంటుంది. అంతా శాంతే. కానీ ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి చిత్రంలో వీరత్వం ఉంటుంది. అందుకే ఈ సినిమాకు అంత క్రేజ్. సైరా చిత్రం చరిత్ర ఉన్నంత కాలం అందులో నిలిచిపోతుంది. చిరంజీవి, రాంచరణ్ చరితార్థులుగా మిగిలిపోతారు అని పరుచూరి వెంకటేశ్వర్ రావు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X