Sye Raa Trailer records: ప్రభాస్, మహేశ్‌లను బీట్ చేయలేకపోయిన చిరంజీవి!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సైరా నరసింహా రెడ్డి' ట్రైలర్ విడుదలై అన్ని వర్గాల నుంచి ప్రశంసలను అందుకుంటోంది. అయితే, ఇప్పటి వరకు ఉన్న ట్రైలర్ రికార్డులను తిరగరాస్తుందని భావించినప్పటికీ అలా జరగలేదు.

సైరా రికార్డులు బ్రేక్ చేస్తుందనుకున్నా..
24 గంటల్లో అత్యధిక ట్రైలర్ వ్యూస్ సాధించిన తెలుగు చిత్రాల్లో బాహుబలి-2నే ఇప్పటి వరకు టాప్‌లో ఉంది. ప్రభాస్ నటించిన ఈ చిత్ర ట్రైలర్ వ్యూస్‌ను చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి దాటేస్తుందని భావించినా.. అది సాధ్యం కాలేదు. బాహుబలి2 21.81 మిలియన్ల ట్రైలర్ వ్యూస్ వచ్చాయి.

ప్రభాస్, మహేశ్‌ను బీట్ చేయలేకపోయిన చిరంజీవి
బాహుబలి22 తర్వాత ప్రభాస్ నటించిన సాహో ట్రైలర్ 12.32 మిలియన్ల వీక్షణలతోపాటు రెండో స్థానంలో ఉంది. ఇక 7.31 ట్రైలర్ వీక్షణలతో మహేష్ బాబు నటించిన మహర్షి మూడో స్థానంలో నిలిచింది. ప్రభాస్, మహేశ్ నటించిన ఈ చిత్రాలను కూడా సైరా బీట్ చేయలేకపోయింది.

నాలుగో స్థానంలో జూ. ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత ట్రైలర్‌కు 7.8 మిలియన్(1ఛానల్: 6.98మిలియన్లు) రాగా.. కళ్యాణ్ రామ్ నటించిన నా నువ్వే ట్రైలర్‌కు 6.97 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అత్యధిక ట్రైలర్ వ్యూస్ వచ్చిన తెలుగు చిత్రాల జాబితాలో నాలుగు, ఐదు స్థానాల్లో ఈ చిత్రాలు నిలిచాయి.
టాప్-8లో సైరా..
రాంచరణ్ తేజ్ నటించిన వినయ విధేయ రామా ట్రైలర్‌కు 6.57మిలియన్ల వీక్షణలు, అజ్ఞాతవాసి ట్రైలర్‌కు 6.2మిలియన్ల వ్యూస్ వచ్చాయి. వీటన్నింటి తర్వాత చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి ట్రైలర్‌కు తొలి 24గంటల్లో 6.19మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం. సైరా ట్రైలర్ అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని భావించినప్పటికీ అత్యధికంగా వ్యూస్ వచ్చిన ట్రైలర్ల జాబితాలో 8వ స్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications











