చిరంజీవికి ఎలా రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ సోహెల్ ఎమోషనల్
బిగ్‌బాస్ తెలుగు షో నుంచి బయటకు వచ్చిన సయ్యద్ సోహెల్ ర్యాన్‌కు బంపర్ ఆఫర్ లభించింది. జార్జ్ రెడ్డి, ప్రెజర్ కుక్కర్ నిర్మాత అప్పి రెడ్డి నిర్మాణ సారథ్యంలో బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ సయ్యద్ సోహైల్ ర్యాన్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ గురువారం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నటుడు బిగ్ బాస్ ఫేం సయ్యద్ సోహైల్ మాట్లాడుతూ..

నేను బిగ్ బాస్ కు వెళ్లకముందు కొన్ని సినిమాలు చేశాను కానీ అవేవీ నాకు సరైన గుర్తింపు నివ్వలేదు. బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది ఫ్రెండ్స్ ను, పేరును సంపాదించుకున్నాను. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ లో నేను చేసిన వాటిని ఇమిటేషన్ చేస్తూ వీడియోలు చేయడం చాలా సంతోషం అనిపించింది.
ముఖ్యంగా చిరంజీవి గారు ఇంటి నుంచి నాకు బిర్యానీ రావడం నేను జీవితంలో మర్చిపోలేను. నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణమైన బిగ్ బాస్ కు జీవితాంతం ఋణ పడి ఉంటాను. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఎలాంటి మూవీ చేస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు.
నిజంగానే ఈ కథ వేరే ఉంటుంది. ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రజల మనసులు ముఖ్యంగా మహిళల మనసులు గెలుచుకొంటాను. అప్పి రెడ్డి గారు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేయడం ఇండస్ట్రీకి శుభపరిణామం. వారు డేర్ చేసి మమ్మల్ని నమ్మి ఈ మూవీ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు అని సోహెల్ అన్నారు.


Click it and Unblock the Notifications











