twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా ఫ్యాన్స్‌కు షాక్.. సైరా మరింత ఆలస్యం.. కారణం అదేనట..

    చారిత్రాత్మక కథ సైరా నర్సింహరెడ్డితో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి మెగాస్టార్ చిరంజీవి సిద్ధమయ్యాడు. అయితే ఎప్పుడో సెట్స్‌ పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం ఏదో కారణంగా వెనక్కుతగ్గుతున్నది.

    By Rajababu
    |

    పదేళ్ల గ్యాప్‌ తర్వాత ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి వెండితెర మీద మరోసారి మ్యాజిక్ చేశాడు. చిరంజీవి పునరాగమనంతో అభిమానులు పండుగ చేసుకొన్నారు. వెంటనే చారిత్రాత్మక కథ సైరా నర్సింహరెడ్డితో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి మెగాస్టార్ చిరంజీవి సిద్ధమయ్యాడు. అయితే ఎప్పుడో సెట్స్‌ పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం ఏదో కారణంగా వెనక్కుతగ్గుతున్నది. అయితే సెట్స్‌పైకి వెళ్లడానికి అడ్డంకులు ఎదుర్కోవడం వెనుక ఓ కారణం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..

    Recommended Video

    Filmibeat Top 10 ఫిల్మిబీట్ టాప్ టెన్..
     సైరా ఫస్ట్‌లుక్ రిలీజ్ ఓకే

    సైరా ఫస్ట్‌లుక్ రిలీజ్ ఓకే

    ఖైదీ నంబర్ 150 తర్వాత సైరా నరసింహారెడ్డికి మెగాస్టార్ చిరంజీవి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. చిరంజీవి బర్త్‌డేను పురస్కరించుకొని స్వాతంత్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న సైరా సినిమా ఫస్ట్ లుక్‌ను ఆగస్తు 22న విడుదల చేశారు.

     సెట్స్‌పైకి వెళ్లడంలో జాప్యం

    సెట్స్‌పైకి వెళ్లడంలో జాప్యం

    ఆగస్టు ముగిసి ప్రస్తుతం నవంబర్ వస్తున్న సైరా సినిమాకు ముందుకు జరుగలేదు. సెట్స్ పైకి వెళ్లకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. జాప్యానికి కారణం ఏమై ఉంటుందా అని అభిమానులు ఆందోళనలో పడ్డారు.

     సెట్స్ నిర్మాణంతో ఆలస్యం

    సెట్స్ నిర్మాణంతో ఆలస్యం

    అభిమానులకు ఊరట కలిగించేందుకు గానూ సైరా అక్టోబర్‌లోనే సెట్స్‌పైకి వెళుతుందని వార్తలు వచ్చాయి. అయితే సైరా కోసం హైదారాబాద్ శివార్లలో వేస్తున్న భారీ సెట్స్ నిర్మాణానికి సమయం పట్టడం ఆలస్యానికి ప్రధాన కారణమని తెలిసింది.

     రంగస్థలంపై రాంచరణ్ దృష్టి

    రంగస్థలంపై రాంచరణ్ దృష్టి

    అంతేకాకుండా సైరాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న రాంచరణ్ ప్రస్తుతం ‘రంగస్థలం 1985' సినిమాను పూర్తి చేయడంపై దృష్టిపెట్టడం కూడా మరో కారణమని తెలుస్తున్నది. అయితే కొణిదెల బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను ఉపాసనకు అప్పగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

     150 కోట్ల బడ్జెట్‌తో

    150 కోట్ల బడ్జెట్‌తో

    రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా సైరా తెరకెక్కనున్నది. రంగస్థలం 1985 పూర్తయిన తర్వాతే ఈ సినిమాను ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారట చిరు. తాజా సమాచారం ప్రకారం సైరా జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

     చిరు చిత్రంలో అమితాబ్

    చిరు చిత్రంలో అమితాబ్

    హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న సైరా చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్, నాజర్, సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    English summary
    Megastar Chiranjeevi’s much expected 151st movie Syera Narasimhareddy first look poster will be unveiled on August 22. But This movie did not go to sets as per schedule of October. This movie shooting will be delayed for sets constructions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X