సైరా టీజర్ దుమ్ముదుమారం.. 5 గంటల్లోనే 5 మిలియన్ల వ్యూస్!
మెగాస్టార్ చిరంజీవి సైరా టీజర్ రికార్డుల మోత మొదలైంది. రేపు చిరంజీవి జన్మదినం సందర్భంగా ఈ ఉదయం 11: 30 గంటలకు సైరా నరసింహారెడ్డి టీజర్ విడుదుల చేశారు. టీజర్ క్షణాల్లో వైరల్ గా మారింది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గెటప్ లో మెగాస్టార్ చిరంజీవి పవర్ ఫుల్ గా కనిపించాడు.
టీజర్ విడుదలైన కొద్దిసేపటికే రికార్డుల మోత మొదలు పెట్టింది. సైరా టీజర్ కేవలం ఐదు గంటల్లోనే 5 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించింది. మెగా ఫాన్స్ ఈ టీజర్ ని విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. రెండు లక్షలకు పైగా లైక్స్ తో దూసుకుపోతోంది.

టీజర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ సంగీత అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ వంటి హేమా హేమీలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్. 2019 లో ఈ చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











