సైరా జోరుకు బ్రేకులు.. చిత్ర యూనిట్‌కు నిరాశ కలిగించేలా!
Recommended Video

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయో తెలిసిందే. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం సినీవర్గాలు అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఎలా ఉండబోతోంది, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో చిరంజీవి ఎలా నటించబోతున్నారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొనివుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి అత్యంత కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ నగర శివారులో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

నరసింహారెడ్డి దండయాత్ర
సైరా నరసింహారెడ్డి బ్రిటిష్ వారి కోటాపై దండెత్తే పోరాటసన్నివేశాలకు సంబందించిన సీన్స్ ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సన్నివేశాల్ని నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరిస్తున్నారు.

భారీ సెట్
ఈ పోరాటసన్నివేశాల కోసం కోకాపేటలో భారీ సెట్ నిర్మించినట్లు తెలుస్తోంది. వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు నేపథ్యంలో ఈ పోరాటసన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.

వరుణుడి అడ్డంకి
ఇప్పటికే సైరా చిత్ర షూటింగ్ ఆలస్యం అవుతోందని వార్తలు వస్తున్నాయి. నగరంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షంతో సైరా చిత్ర షూటింగ్ మరింత ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. వర్షం వరాల చిత్ర యూనిట్ తీవ్ర నిరాశలో ఉందట.

అన్నీ సిద్ధం చేసుకున్న తరువాత
షూటింగ్ కోసం అన్ని సిద్ధం చేసుకున్న తరువాత వర్షం ఆటంకం కలిగిస్తుండడంతో వందలాది ఆర్టిస్టులు వెనుదిరిగి వెళ్ళిపోతున్నట్లు తెలుస్తోంది. దీనివలన సైరా చిత్ర షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











