Syeraa మెగా సర్‌ప్రైజ్.. పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు మెగా హీరోలంతా ఒకే వేదికపై..
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సైరా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లోని ఎల్‌బీ స్టేడియంలో జరుగుతున్న సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు పెద్ద ఎత్తున మెగా అభిమాన వర్గం తరలి వస్తున్నారు. ఇప్పటికే ల్‌బీ స్టేడియం అంతా జన సందోహంతో కిటకిటలాడుతోంది. ఈ వేడుకకు సుమ హోస్ట్ గా చేయనుంది. సుమ మాటలు, పంచ్ డైలాగులతో సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాగణంలో సందడి వాతావరణం నెలకొననుంది.

ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ విచ్చేస్తుండగా.. మిగిలిన మెగా హీరోలంతా ఈ వేదికపై కనిపించనున్నారు. మరికొద్ది సేపట్లోనే మెగా హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఈ వేదిక వద్దకు చేరుకోనున్నారు. దీంతో ఒకే వేదికపై ఈ మెగా హీరోలను చూడాలని ఆతృతగా ఉన్నారు మెగా అభిమానులు.


Click it and Unblock the Notifications











