బ్లూ ఫిలిం భయంతో వణికిపోతున్న మాజీ స్టార్ హీరో
హాలీవుడ్ యాక్షన్ హీరో సిల్వస్టర్ స్టాలిన్ ఇప్పుడు బ్లూ ఫిలిం భయం పట్టుకుంది. ఆయన కెరీర్ ప్రారంభం రోజుల్లో చేతిలో(1970) డబ్బు లేనప్పుడు కక్కుర్తిపడి నటించిన బ్లూ ఫిలిం "ది పార్టీ ఎట్ కిట్టి అండ్ స్టడ్స్" ఇప్పుడు మళ్ళీ రీరిలీజ్ కు రెడీ అయింది. ఆ చిత్రానికి "ఇటాలియన్ స్టాలిన్" అనే కొత్త టైటిల్ పెట్టి మరీ రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఈ అరవై నాలుగేళ్ళ ఏళ్ళ యాక్షన్ హీరో తను ఇన్నాళ్ళుగా సంపాదించుకున్న పరువు..ప్రతిష్టలు, గౌరవం అన్నీ మంటగలసిపోతాయని భయపడుతున్నాడు. 1976లో రిలీజైన "రాకీ" చిత్రం దాకా ప్రపంచానికి సిల్వస్టర్ స్టాలిన్ ఎవరో తెలియకపోవటంతో ఆ చిత్రానికి రిలీజైనప్పుడు పెద్ద క్రేజ్ రాలేదు. దాంతో ఆ నిర్మాత ఇన్నాళ్ళూ ఆగి ఇప్పుడు ఆ సినిమాని వేరే సంస్ధకు మంచి మొత్తానికే అమ్మాడు. వాళ్ళు ఈ చిత్రానికి మంచి వసూళ్ళు వస్తాయని భావిస్తున్నారు. మరో ప్రక్క సిల్వస్టర్ స్టాలిన్ నటించి తానే దర్శకత్వం వహించిన 'ది ఎక్స్‌పెండబుల్స్' సినిమా విజయం సాధించటంతో మరో సీక్వెల్ కు సిద్దపడుతున్నాడు.


Click it and Unblock the Notifications











