'బిగ్‌బాస్ 5' లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ సైమండ్స్..
ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందిన రియాలిటీ షోలలో 'బిగ్ బాస్ 5' ఒకటి. ఈ వారం ఈ రియాలిటీ టివిషోకి ఆస్ట్రేలియా క్రికెట్ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ పాల్గోనున్నారని సమాచారం. గతంలో కలర్స్ షోలో ఇంటర్నేషనల్ సెలబ్రిటీ ఇండో-కెనడియన్ పార్న్ స్టార్ సున్నీ లియోన్ పాల్గోన్న తర్వాత, బిగ్ బాస్ 5 కార్యక్రమంలో సైమండ్స్ పాల్గోనడంతో రెండవ ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా అవతరించనున్నారు.
36 సంవత్సరాలు వయసు కలిగిన ఆల్ రౌండర్ బిగ్ బాస్ 5 కార్యక్రమంలో పాల్గోనబోతున్న సమాచారాన్ని మంగళవారం ముంబైలో ప్రెస్ కాన్పరెన్స్ ద్వారా తెలియజేయనున్నారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్న కంటెస్టంట్‌లు అందరూ కూడా 24 గంటలు కెమెరా క్రింద బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా జీవించడం జరుగుతుంది.14 మంది కంటెస్టంట్‌లతో అక్బోబర్ 2 నుండి బిగ్ బాస్ 5 కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











