చిరు వర్సస్ బాలయ్య..ఈ యుద్ధం ముగిసేది కాదా!
Recommended Video

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి అందగాడు బాలయ్య సినిమాలు ఎప్పుడు విడుదలైనా వీరి అభిమానులకు పండగే. గతంలో పలు మార్లు ఈ టాప్ హీరోలు ఇద్దరూ వారి చిత్రాలతో పోటీ పడ్డ సందర్భాలు ఉన్నాయి. బాలయ్య, చిరంజీవి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్దకు ఒకేసారి వస్తున్నాయంటే అభిమానుల్లో చిత్ర పరిశ్రమలో ఉండే సందడే వేరు. గతంలో బాలయ్య, చిరు పోటీ పడ్డ సందర్భాలు వేరు.. ఇప్పుడు పోటీపడుతున్న సందర్భం వేరు. ఎందుకంటే ఈ హీరోలిద్దరూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్రాలు 2019 వేసవిలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నటిస్తునారు. బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ రెండు చిత్రాలు వేసవి బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

స్వాతంత్ర సమరయోధుడి గాధగా సైరా
చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్రం తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలా వాడ నరసింహ రెడ్డి చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా చిరంజీవి సరికొత్త గెటప్ లో కనిపించనున్నారు. రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది.

ఎన్టీఆర్ గా మారిపోనున్న బాలయ్య
బాలకృష్ణ ఇప్పటికి వరకు 102 చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి ఉండొచ్చు. కానీ తొలిసారి తన తండ్రిలో పాత్రలో నటించనుండడం మాత్రం బాలకృష్ణకు పెద్ద సవాల్ అని చెప్పొచు. అందుకే తన తండ్రి జీవిత గాధ ప్రతి ఒక్క తెలుగువాడిని మెప్పించేలా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇద్దరు సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు
స్టైలిష్ చిత్రాల దర్శకుడిగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సురేందర్ రెడ్డి మెగాస్టార్ సైరా చిత్రాన్ని తెరకేక్కిస్తున్నాడు. సురేందర్ రెడ్డి చివరగా దర్శకత్వం వహించిన చిత్రం ధృవ. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. రామ్ చరణ్ ని డైరెక్ట్ చేసిన ఉత్సాహంతోనే సురేందర్ రెడ్డి చిరుని సైరా నరసింహా రెడ్డిగా చూపించడానికి సిద్దం అయ్యాడు. ఇక మొన్నటివరకు ప్లాపుల్లో ఉన్న దర్శకుడు తేజ..నేనే రాజు నేనే మంత్రి చిత్రం ద్వారా సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఎన్టీఆర్ జీవిత చరిత్రని తెరకెక్కించడం అంటే అది తేజకు గొప్ప అవకాశమే.

గతంలో పోటీ పడ్డ బాలయ్య, చిరంజీవి
బాలకృష్ణ, చిరంజీవి గతంలో పలు మార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డారు. చిరంజీవి నటించిన మృగ రాజు, బాలకృష్ణ నరసింహనాయుడు చిత్రాలు ఒకేసారి విడుదల కాగా, గత ఏడాది సంక్రాంతికి చిరంజీవి ఖైదీ నెం 150 గా మరియు బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణిగా వచ్చారు.

మండు వేసవిలో సమరం
సైరా నరసింహా రెడ్డి చిత్రాన్ని 2019 వేసవి కానుకగా అభిమానులకు అందించాలని మెగా కాంపౌండ్ భావిస్తోంది. అలాగే బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఎన్నికలకు ముందు విడుదల చేయాలనేది ప్లాన్. తర్వాతి ఎన్నికలు 2019 వేసవిలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య మరియు చిరంజీవిల బాక్స్ ఆఫీస్ సమరం మరో మారు చూసే అవకాశం ఉన్నట్లు చిత్ర టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయ.


Click it and Unblock the Notifications











