మహేష్ కారు అడ్డగించి ..దాడి
ఆదివారం సాయింత్రం మహేష్ బాబు కారుని తెలంగాణ వాదులు అడ్డగించి దాడి చేసినట్లు తెలుస్తోంది.సంఘటన వివరాల్లో కి వెళితే మహేష్ తాజా చిత్రం దూకుడు షూటింగ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన సెట్టింగ్స్ ను ధ్వంసం చేశారు. గత రెండు రోజులుగా వికారాబాద్ రైల్వేస్టేషన్ లో దూకుడు సినిమాకు సంబంధించి కొన్ని సీన్లను షూట్ చేస్తున్నారు. కాగా ఆదివారం ఉదయం.. కొందరు తెలంగాణ వాదులు వచ్చి షూటింగ్ ను నిలిపేయాలని కోరారు.
కానీ తర్వాత షూటింగ్ యథావిధిగా కొనసాగింది. అయితే సాయంత్రం మరోసారి తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. అక్కడ వేసిన సెట్లను ధ్వంసం చేశారు. జై తెలంగాణ నినాదాలతో షూటింగ్ కు ఆటంకం కలిగించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. అదే సమయంలో మహేష్ బాబు కార్ లో దగ్గర్లో ఉన్న గెస్ట్ హౌజ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆయన కారును కూడా అడ్డుకున్నారు. ఒక్కసారిగా కార్లపై రాళ్లతో కర్రలతో దాడి చేసినట్లు చెప్తున్నారు.
అయితే అప్పటికప్పుడే మహేశ్ బాబును వేరే కార్లో హైదరాబాద్ కు పంపించారు. దీంతో మహేశ్ క్షేమంగా గా బయటపడ్డారు. కాగా సంఘటనా స్థలంలోకి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో మహేశ్ బాబు ఖలేజా సినిమా షూటింగ్ ను కూడా ఇలాగే తెలంగాణ వాదులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











