నితిన్ కి తెలంగాణా ఇష్యూ తో లక్ తిర్గుతుందా?
నితిన్ ని ఇప్పుడు తెలంగాణా ముద్దు బిడ్డగా అంతా సంభోదిస్తున్న సంగతి తెలిసిందే. అతని తాజా చిత్రం 'సీతారాముల కళ్యాణం'..లంకలో సంక్రాంతి రోజున రిలీజ్ అవుతోంది. అలాగే చిత్ర దర్శకుడు ఈశ్వర్ రెడ్డి కూడా తెలంగాణాకి సంభందించిన వాడే.నిర్మాతలు మాత్రం ఆంధ్రావారు(వైజాగ్). ఇక దర్శకుడు,హీరో ఇద్దరూ తమ ప్రాంతానికి చెందినవారు కావటంతో తమ తెలంగాణా ఏరియాల్లో సూపర్ హిట్ చేస్తారా..లేదా అన్నది అన్ని చోట్లా వినపడుతోంది. అదుర్స్ చిత్రాన్ని ఆపుచేసి తద్వారా తమ నితిన్ చిత్రానికి దెబ్బ లేకుండా చేస్తున్నామని కొందరంటున్నారు. ఇక ఇప్పుడు వరకూ జయం,దిల్ మినహా వరస ఫ్లాపులతో నితిన్ రెచ్చిపోయి నటిస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ(అడవి), రాఘవేంద్రరావు(అల్లరి బుల్లోడు) వంటి వారు కూడా నితిన్ ని ప్లాఫ్ ల బారినుంచి కాపాడలేకపోయారు. ఈ మధ్య కాలంలో పెరిగిన ప్రాంతీయ విద్వేషాల పుణ్యమా అని అతను మెగాస్టార్ అయ్యే అవకాసం ఉందంటున్నారు. తమ హీరో సినిమా కదా అని ఎలాగైనా హిట్ చేస్తారంటున్నారు. దాంతో ఈ అవకాశం నితిన్ కు కలిసి వస్తుందని, ఇది కూడా మిస్సైతే కష్టమే అనేది సీనియర్స్ మాట.


Click it and Unblock the Notifications











