ఫిల్మ్‌ఇండస్ట్రీ ల్యాండ్స్: GoMకు ‘టి’ ఫిల్మ్ ఛాంబర్ లేఖ

By Bojja Kumar

Telangana Cinema Chamber of Commerce
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత...వివిధ రంగాల్లోని సమస్యలు తెలుసుకునేందుకు కేంద్ర మంత్రి ఏ.కె.ఆంటోని నేతృత్వంలో గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్(GoM) అభిప్రాయ సేకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వారు కూడా GoMకు లేఖ రాసారు.

ఈ లేఖ గురించి తెలంగాణ ఫిల్మ్ చాంబర్ జనరల్ సెక్రటరీ సయిద్ రఫి వివరిస్తూ....విభజన సమయలో తెలుగు సినిమా పరిశ్రమకు కేటాయించిన భూములపై కూడా దృష్టి సారించాలని, భూములు పొందిన కొందరు నిబంధనలకు విరుద్ధంగా భూములను ఉపయోగిస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు తెలిపారు. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ తమకు కేటాయించిన భూములను పరిశ్రమ అభివృద్ధి కోసం కాకుండా ఇతర ప్రయోజనల కోసం ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు.

తెలంగాణ ఫిల్మ్ చాంబర్ గురించిన వివరాల్లోకి వెళితే....తెలంగాణ సినీ కళాకారులు, టెక్నీషియన్స్ ప్రయెజనాలు కాపాడుకోవడంలోనే ఈ చాంబర్ ఏర్పాటయింది. తెలంగాణ సినీ చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ 'ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా'కు అనుబంధంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో సినిమా పరిశ్రమ అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ సినీ చాంబర్ ఆఫ్ కాంబర్స్ పని చేస్తుందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X