twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ప్రేమదాసు’గా మారిన హీరో శింబు తండ్రి

    By Bojja Kumar
    |

    T Rajendar
    హైదరాబాద్: ఈ జనరేషన్ తెలుగు ప్రేక్షకులకు టి రాజేందర్ గురించి పెద్దగా తెలియక పోవచ్చు. తమిళ హీరో శింబు తండ్రి అంటే మాత్రం కాస్త గుర్తుకు రావచ్చు. ప్రేమ సాగరం, ప్రేమసామ్రాజ్యం, మైధిలి నా ప్రేయసి, హలో మై డియర్ మొనీషా, వరపుత్రుడు, కుర్రాడొచ్చాడు వంటి చిత్రాల నిర్దేశకుడు సుప్రసిద్ధ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత టి. రాజేందర్ ఓ ప్రేమకధా చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు.

    'శింబు సినీ ఆర్ట్స్'పతాకంపై 'ప్రేమదాసు' పేరుతో తెలుగు‌లో తెరకెక్కే ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, కెమెరా పర్యవేక్షణ, దర్శకత్వం వహిస్తూ ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సందర్భంగా టి . రాజేందర్ మాట్లాడుతూ 'పూర్తిగా గోదావరి తీర ప్రాంతాలలో, పచ్చదనంలో, పల్లెటూరి వాతావరణంలో సాగే స్వచ్ఛమైన అచ్చతెలుగు 'సంగీత భరిత ప్రేమకధా చిత్రం ఈ 'ప్రేమదాసు' అని అన్నారు.

    ఆయనే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం లో నాయికగా నీహారిక నటిస్తున్నారు. ఈ నెల 18 న హైదరాబాద్ లో ప్రారంభమయ్యే చిత్రం షూటింగ్ ఆ తరువాత గోదావరి ప్రాంతానికి చేరుకుంటుంది. 'మే' నెలాఖరునాటికి చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తవుతాయని టి . రాజేందర్ తెలిపారు.

    ఇతర ప్రధాన పాత్రలలో సీతానారాయణన్, ఏవీయస్, నాగినీడు, దినేష్, అనంత్, ధనరాజ్, నల్లవేణు, తిరుపతిప్రకాష్, సుమన్ షెట్టి, ప్రభ, జయలలిత‌లు నటిస్తున్నారు. కెమెరా: సావై సహదేవన్, రచనా సహకారం: బోస్ బాబు. జి, ఆర్ట్: మహి, ఎడిటింగ్: సుధాకర్, సహ నిర్మాత: ఉషా రాజేందర్. కథ-మాటలు-పాటలు-సంగీతం-కెమెరా పర్య వేక్షణ-నిర్మాత-దర్శకత్వం: టి. రాజేందర్.

    English summary
    T Rajendar is a Tamil film actor and director as well as a composer, screenwriter, cinematographer, producer, singer,and playback singer. He is also a politician in Tamil Nadu, India. He is the father of actor Simbu. His next movie Premadaasu will start from March 18.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X