Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘ప్రేమదాసు’గా మారిన హీరో శింబు తండ్రి
'శింబు సినీ ఆర్ట్స్'పతాకంపై 'ప్రేమదాసు' పేరుతో తెలుగులో తెరకెక్కే ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, కెమెరా పర్యవేక్షణ, దర్శకత్వం వహిస్తూ ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సందర్భంగా టి . రాజేందర్ మాట్లాడుతూ 'పూర్తిగా గోదావరి తీర ప్రాంతాలలో, పచ్చదనంలో, పల్లెటూరి వాతావరణంలో సాగే స్వచ్ఛమైన అచ్చతెలుగు 'సంగీత భరిత ప్రేమకధా చిత్రం ఈ 'ప్రేమదాసు' అని అన్నారు.
ఆయనే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం లో నాయికగా నీహారిక నటిస్తున్నారు. ఈ నెల 18 న హైదరాబాద్ లో ప్రారంభమయ్యే చిత్రం షూటింగ్ ఆ తరువాత గోదావరి ప్రాంతానికి చేరుకుంటుంది. 'మే' నెలాఖరునాటికి చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తవుతాయని టి . రాజేందర్ తెలిపారు.
ఇతర ప్రధాన పాత్రలలో సీతానారాయణన్, ఏవీయస్, నాగినీడు, దినేష్, అనంత్, ధనరాజ్, నల్లవేణు, తిరుపతిప్రకాష్, సుమన్ షెట్టి, ప్రభ, జయలలితలు నటిస్తున్నారు. కెమెరా: సావై సహదేవన్, రచనా సహకారం: బోస్ బాబు. జి, ఆర్ట్: మహి, ఎడిటింగ్: సుధాకర్, సహ నిర్మాత: ఉషా రాజేందర్. కథ-మాటలు-పాటలు-సంగీతం-కెమెరా పర్య వేక్షణ-నిర్మాత-దర్శకత్వం: టి. రాజేందర్.