twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR ఆడియో హక్కులను దక్కించుకున్న బడా కంపెనీలు.. నిర్మాతకు మరిన్ని లాభాలు

    |

    ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు అందరిని షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల సినిమాకు సంబంధించిన ఆడియో హక్కులపై కూడా క్లారిటీ వచ్చేసింది. లహరి మ్యూజిక్, టీ సీరీస్ రెండు సంస్థలు కలిపి అత్యధిక ఎమౌంట్ కు మ్యూజిక్ హక్కులను సొంతం చేసుకున్నాయి.

    బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి..

    బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి..

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాలో రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటిస్తున్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు - కొమరం భీమ్ పాత్రల్లో మన హీరోలు బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ లుక్ టీజర్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

    ఫస్ట్ సాంగ్ ఎప్పుడంటే..

    ఫస్ట్ సాంగ్ ఎప్పుడంటే..

    బాహుబలి అనంతరం దర్శకధీరుడు రాజమౌళి చేస్తున్న ఈ మల్టీస్టారర్ పై ముందు నుంచే బడా కంపెనీలు ఫోకస్ పెట్టాయి. RRR బిజినెస్ ఛాన్సులను ఏ మాత్రం వృధా చేసుకోవద్దని టార్గెట్ చేశారు. ఇక ఆడియో రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. టీ సీరీస్ లహరి మ్యూజిక్ కలిసి ఆడియోను రిలీజ్ చేయబోతున్నాయి. ఆగస్ట్ మొదట్లోనే ఫస్ట్ ప్రమోషన్ సాంగ్ సందడి చేయబోతున్నట్లు సమాచారం.

     ఆడియో రైట్స్ డీల్..ఎంతంటే?

    ఆడియో రైట్స్ డీల్..ఎంతంటే?


    ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీస్ సాంగ్స్ ను లహరి - టీ సిరీస్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.25కోట్లకు పైగా ఆడియో రైట్స్ ద్వారానే వచ్చినట్లు తెలుస్తోంది.

    మొత్తం బిజినెస్ ఎంతంటే?

    మొత్తం బిజినెస్ ఎంతంటే?


    ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే మొత్తంగా 900కోట్ల బిజినెస్ చేస్తున్న RRR సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. సినిమాను 350కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 400కోట్ల వరకు ఖర్చు కావచ్చని తెలుస్తోంది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా అప్పుడే 500కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు చూపిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.

    English summary
    Get ready to witness the grandeur of India’s biggest collaboration ever! India's biggest music labels - Bhushan Kumar's T-Series and Lahari Music, have now bagged the music rights to SS Rajamouli's much-awaited magnum opus RRR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X