Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హీరోయిన్స్ తో నా రిలేషన్స్...టి సుబ్బిరామరెడ్డి
హీరోయిన్లతో నాలుగు ఫొటోల్లో ఎక్కువగా కనిపించగానే అపార్థం చేసుకున్నారు. నేనది తెలుసుకున్నాను. అప్పటి నుంచి దూరంగా ఉండడం నేర్చుకున్నా. అయినా సినీ యాక్టర్లను అపార్థం చేసుకోకూడదు అంటూ తనకీ,హీరోయిన్స్ కీ మధ్య ఉన్న రిలేషన్ గురించి టి.సుబ్బిరామరెడ్డి ఓ టీవి చానెల్ తో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. అలాగే తొంభై శాతం సినిమా యాక్టర్లు, హీరో హీరోయిన్లు బయట యావరేజి. పెద్ద అందంగా ఉండరు. హీరోయిన్స్‌ను చాలామంది అపార్థం చేసుకుంటారు. హీరో హీరోయిన్లను దగ్గరగా చూస్తే ప్రేక్షకుడు సంతోషపడతాడు. కానీ నిజజీవితంలో అదేమీ ఉండదు అన్నారు. ఇక అప్పట్లో అక్కినేనికి సన్నిహితుడిని అయ్యాను. ఫిల్మ్‌స్టార్ పాపులర్ స్టార్. ఆ స్టార్స్ మన పక్కన ఉంటే మనకీ పాపులారిటీ వస్తుంది అనే ఉద్దేశ్యంతో నేను వ్యవహిస్తూంటాను అన్నారు. అలాగే హీరోయిన్లు ఎవరైనా మిమ్మల్ని ముగ్గులోకి దించారా? అన్న దానికి సమాధానంగా హీరోయిన్స్ ని ఫంక్షన్లు, డిన్నర్లకు పిలిచేవాడినంతే. ఢిల్లీలో సుబ్బరామిరెడ్డి పార్టీ అంటే బాంబే స్టార్లు వస్తారని పెద్ద ప్రతీతి అన్నారు. ఆయన హిందీలో చాందినీ, లమ్హే,గ్యాంగ్ మాస్టర్ హిందీలో నిర్మించారు. అలాగే స్వామి వివేకానంద, భగవత్ గీత వంటి ఆధ్మాత్మిక చిత్రాలు సైతం నిర్మించారు. ఇక తెలుగులో స్టేట్ రౌడి వంటి చిత్రాలు తీసి హిట్ కొట్టారు.