నాగచైతన్య ‘ఆటోనగర్ సూర్య’కు తెలంగాణ సెగ
నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'ఆటోనగర్ సూర్య" సినిమా షూటింగును తెలంగాణ వాదులు శుక్రవారం అడ్డుకున్నారు. కొన్ని సన్నివేశాలను చిత్రీకరించేందుకు హైదరాబాద్ లోని షాపూర్ నగర్ లో సినిమా షూటింగ్ జరుగుతుండగా జై తెలంగాణ నినాదాలు చేస్తూ అక్కడికి వచ్చిన తెలంగాణ వాదులు....ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా లేని హీరోల షూటింగ్ ఇక్కడ జరుగడానికి వీల్లేదని ఆందోళన చేసినట్లు తెలిసింది. ఈ పరిణామాలతో యూనిట్ సభ్యులు షూటింగ్ రద్దు చేసుకుని అక్కడి నుంచి వెళ్లి పోయారు.
ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై 'ప్రేమకావాలి' నిర్మించిన కె.అచ్చిరెడ్డి తాజాగా దేవా కట్టా దర్శకత్వంలో 'ఆటోనగర్ సూర్య' నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాష్‌రెడ్డి, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు, అజరు, వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, మధు, పృథ్వీ, గాంధీ, అజరు ఘోష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్, సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్, ఎడిటింగ్: గౌతంరాజు, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, ఆర్ట్: రవీందర్.


Click it and Unblock the Notifications











