తెలంగాణ హీరో షూటింగ్‌పై దాడి
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో....సీమాంద్ర హీరోల షూటింగులను అడ్డుకోవడం, వారి షూటింగులపై దాడి చేయడం లాంటి ఘటనలను మనం ఇంత వరక చూశాం. ఎందుకిదంటా అంటే...వాళ్లు తెలంగాణేతరులు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం లేదని వాదించారు కొందరు. అయితే తాజాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరో నితిన్ నటిస్తున్నషూటింగును కూడా అడ్డుకున్నారు తెలంగాణ వాదులు.
హైదరాబాద్ పరిసరప్రాంతమైన దుండిల్ లో నితిన్ తాజా సినిమా ఇష్క్ సినిమా షూటింగ్ జరుగుతుండగా తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. అయితే నితిన్ తాను తెలంగాణకు అనుకూలమే అని ప్రకటించడంతో తెలంగాణ వాదులు శాంతిచారు. ఈ పరిణామాలతో సినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది.
యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు విక్రకమ్ కుమార్(13 బి ఫేం) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేష్ఠ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను విక్రమ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అరవింద్ శంకర్ సంగీతం అందిస్తుండగా, సినిమాటో గ్రపీ : పిసి శ్రీరామ్, ఆర్ట్ : రాజీవన్, ఈ సినిమాలో ఇంకా అజయ్, అలి, శ్రీనివాస్ రెడ్డి, సింధు తరుణి, నాగినీడు, సత్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











