నలుగురుతో అంటే ఇష్టమే..కానీ కొత్తవారితో కష్టం: తాప్సీ
News
oi-Surya Prakash Josyula
By Srikanya
నాకు నలుగురితోనూ సరదాగా ఉండటం ఇష్టం. ఆ నలుగురూ తెలిసినవాళ్లే అయ్యిండాలి.అలాగే కొత్తవాళ్లతో అంటే కష్టం.కొత్తగా పరిచయమయ్యేవారితో మాట్లాడాలంటేనే భయం అంటోంది తాప్సీ.గోపిచంద్ సరసన మొగుడు చిత్రంలో చేస్తున్న ఈ ముద్దుగుమ్మను కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది.అలాగే ప్రభాస్ సరసన చేసిన'మిస్టర్ పర్‌ఫెక్ట్'హిట్టై నటిగా మంచి పేరు తెచ్చుకున్నానని చెప్తోంది.అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో నటించటం తన అదృష్టం అంటోంది.నల్లమలుపు బుజ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మొదట రిచా గంగోపాధ్యాయని అనుకుని ఆమె కథ చెప్పమని పోజు కొట్టడంతో ఈమెను చివరి నిముషాల్లో తీసుకున్నారు.