సెక్సీ తాప్సీని ఇలా ఎప్పుడూ చూసుండరు... (నేనే షబాన ఫస్ట్ లుక్)
హిందీ లో తెరకెక్కుతున్న ‘నామ్ షబానా’ చిత్రాన్ని తెలుగు లో ‘నేనే షబాన’ పేరితో రిలీజ్ చేస్తున్నారు
హైదరాబాద్: తెలుగు సినిమా ద్వారా కెరీర్ ప్రారంభించిన హీరోయిన్ తాప్సీ..... సెక్సీ లుక్ టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. తెలుగులో తాప్సీని యాక్షన్ లుక్ లో చూసింది దాదాపుగా లేదనే చెప్పాలి. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్న తాప్సీ త్వరలో 'నేనే షబానా' అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
గొప్ప నటిని కాదు.. పాత్రల కోసం దిగజారలేదు.. తాప్సీ
శివమ్ నైర్ దర్శకత్వం లో తాప్సి , అక్షయ్ కుమార్ , ప్రిథ్వీరాజ్ సుకుమారన్, మనోజ్ బాజ్పాయ్ , అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో హిందీ లో తెరకెక్కుతున్న మూవీ 'నామ్ షబానా'. ఈచిత్రాన్ని తెలుగు లో 'నేనే షబాన' పేరితో రిలీజ్ చేస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ బుధవారం రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే నీరజ్ పాండే కథ అందిస్తున్నారు. ఫ్రైడే ఫిలింవర్క్స్ బ్యానర్ ఫై నీరజ్ పాండే , షీతల్ భాటియా నిర్మిస్తున్నారు. హిందీతో పాటు తెలుగులో ఒకేసారి మార్చి 31న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కాగా తాప్సీ నటించిన 'ఘాజీ' మూవీ ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రానా ప్రధాన పాత్రలో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సీ మెంగాలీ రెఫుగీ అనన్య పాత్రలో నటించింది.


Click it and Unblock the Notifications











