Just In
- 5 hrs ago
పవన్ కల్యాణ్‌తో సమంత అక్కినేని.. ఆ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది అందుకేనా?
- 5 hrs ago
ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డ శ్రియ.. లండన్‌లో పోలీసుల తూటా తప్పించుకొని!
- 6 hrs ago
రామ్ చరణ్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. ఆ ఫ్యాన్‌కు అంకితమిచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు
- 7 hrs ago
సెక్స్ అంటే చాలా ఇష్టం.. నాకు నచ్చిన వాళ్లతో తిరుగుతాను: యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
Don't Miss!
- News
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ... ప్రధాని మోడికి 600 మంది మేధావుల లేఖ
- Sports
బీసీసీఐ లేకుండా టీమిండియా మూడేళ్లు క్రికెట్ ఆడింది.. గంగూలీ ఎంపికతో ఆశ్యర్యపోయా: రవిశాస్త్రి
- Finance
పెరిగిన టారిఫ్‌లు.. మరి ఇప్పుడైనా టెలికాం షేర్లు కొనవచ్చా?
- Lifestyle
బురదలో రొమాన్స్ : ఈ ఫొటో షూట్ ను చూసి తట్టుకోవడం కష్టం.. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
వారిద్దరు నన్నెంతో ప్రేమిస్తారు.. కానీ నేను అలా చేయలేకపోతున్నాను.. తాప్సీ కౌంటర్
బాలీవుడ్లో కంగనా రనౌత్ వర్సెస్ తాప్సీ మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. కంగనా సోదరి రంగోలి వీలు చిక్కినప్పుడుల్లా తాప్సీపై రెచ్చిపోతూనే ఉంటుంది. దానికి తాప్సీ కూడా ఘాటుగానే సమాధానం చెబుతూ వస్తుంది. అయితే ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు మొదలుపెడితే అది అలా కొనసాగుతూనే వస్తోంది. వీరి వాగ్వాదాన్ని ఎంజాయ్ చేసే వారు కూడా ఉంటారు. సోషల్ మీడియాలో ట్వీట్లతో రెచ్చిపోతూ అందరికీ టార్గెట్ అవుతుంటారు.

అలా మొదలైంది..
అసలు వీరిద్దరి మధ్య గొడవ ఎక్కడ మొదలైందంటే...గతంలో ఓసారి కంగనా రనౌత్‌ని ఉద్దేశిస్తూ అతివాదని తాప్సీ వ్యాఖ్యానించింది. దాని మనసులో పెట్టుకున్న కంగనా సోదరి రంగోలి.. తాప్సీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆమె చాలా చీప్.. తక్కువ పారితోషికం తీసుకుంటుందనే ఉద్దేశంతో.. అంటూ మండిపడింది. అంతేకాదు ఇతరులను చూసి కాపీ కొడుతుందని ఘాటుగా విమర్శించింది. అలా వీరి మధ్య మాటల యుద్ధం మొదలై నేటికీ కొనసాగుతోంది.

చిత్రాన్ని పొగిడి కంగనాను వదిలేయడంతో..
జడ్జ్‌మెంటల్ హై క్యా సినిమా ట్రైలర్ చూసిన తాప్సీ చాలా బాగుందని మెచ్చుకుంది. ఐతే ఎక్కడా కంగనా పేరును ప్రస్తావించలేదు. దాంతో రంగోలి ఎంటరై కొందరు కంగనా రనౌత్‌ని కాపీకొడతారని కానీ ప్రశంసించేందుకు మాత్రం మనసు రాదని సెటైర్లు వేసింది. తాప్సీ కౌంటర్ వేస్తూ .. ఎప్పుడూ మహిళా సాధికాతర గురించి మాట్లాడే కంగనా రనౌత్.. మిషన్ మంగళ్ సినిమాను ఎందుకు మెచ్చుకోలేదని విమర్శించింది.

'చీప్', 'కాపీ' అని అంటున్నారు..
ఒక మహిళకు మరో మహిళ అండగా ఉండాలని ఆమె (కంగనా) ఎప్పుడూ చెబుతుంటారు. కానీ నా సినిమాలను ఆమె ఎప్పుడూ మెచ్చుకోలేదు. మిషన్ మంగళ్ సినిమాలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరి మమ్మల్ని ఆమె మెచ్చుకుందా? ఆమె కంటే నేను జూనియర్ని. ఆమెకున్న ఫిల్మోగ్రఫీ నాకు లేదు. కానీ ఇతరులు మెచ్చుకోదగ్గ చిత్రాల్లో నేను నటించా. నన్ను 'చీప్', 'కాపీ' అని అంటున్నారు. నన్ను కంగనా కాపీ అంటే బాధపడను. సంతోషిస్తా. ఎందుకంటే ఆమె నా కన్నా గొప్ప నటి. నా కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటి కూడా.

తాజాగా మరోసారి వార్తల్లో..
తాజాగా ఓ షాలో పాల్గొన్న తాప్సీ వారిద్దరిపై సెటైర్ వేసింది. వారిద్దరికి నేనంటే చాలా ప్రేమ, వారు నన్ను ప్రేమించినంతగా నేను వారిని ప్రేమించలేకపోతున్నాను.. నా గురించి వారు ఎక్కువగా సమయం కేటాయిస్తూ, నా గురించే ఆలోచిస్తుంటారు.. వారికి నిజంగానే నేనంటే ఎంతో ప్రేమ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. మరి వీటికి రంగోలి, కంగనా నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి.

వరుస ప్రాజెక్ట్‌లతో..
ఈ ఏడాది తాప్సీ.. బద్లా, గేమ్ ఓవర్, మిషన్ మంగళ్, సాండ్ కీ ఆంఖ్ లాంటి చిత్రాలతో పలకరిచింది. అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించడమే కాకుండా.. నటిగా మంచి పేరును తీసుకొచ్చింది. తాప్సీ ప్రస్తుతం తప్పడ్, తడ్కా చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.