ఆర్ఎక్స్ 100 తమిళ రీమేక్.. ఘాటు సన్నివేశాలకు తాప్సి రెడీ.. హీరో ఎవరో తెలుసా!
ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన తెలుగు చిత్రం ఆర్ఎక్స్ 100 ఘనవిజయం సాధించింది. అతి తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తికేయ హీరోగా, పంజాబీ అందం పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

అవే హైలైట్
ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయ ఎమోషనల్ నటన, పాయల్ రాజ్ పుత్ బోల్డ్ పెర్ఫామెన్స్ హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్రానికి యువత బ్రహ్మరథం పట్టారు. ఇటీవల విడుదలైన టాలీవుడ్ చిత్రాలలో ఆర్ఎక్స్ 100 చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

తమిళ్ రీమేక్
తమిళ నేటివిటీకి కూడా ఈ చిత్రం బాగా సరిపోతుంది. అందుకే ఆర్ఎక్స్ 100 చిత్ర తమిళ రీమేక్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొని ఉంది. ఔరా సినిమాస్ ఈ చిత్ర తమిళ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

బోల్డ్ రొమాన్స్‌కు రెడీ
సొట్టబుగ్గల సుందరి తాప్సి ఆర్ఎక్స్ 100 తమిళ రీమేక్ లో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. హీరోగా ఆది పినిశెట్టి నటించనున్నాడు. తాను ఆర్ఎక్స్ 100 చిత్రం చూశానని, ఈ చిత్రం తమిళంలో కూడా మంచి విజయం సాధిస్తుందనే ధీమా ఉందని ఆది తెలిపాడు.

నీవెవరో
తాప్సి, ఆది ప్రస్తుతం నీవెవరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. సౌత్ చిత్రాలని పక్కన పెట్టి తాప్సి బాలీవుడ్ కు వెళ్ళింది. అక్కడ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్ళి ఈ సొట్టబుగ్గల సుందరి సౌత్ చిత్రాలతో బిజీగా మారబోతోంది.


Click it and Unblock the Notifications











