»   » గుండె ఆ..గి పోతాందే: తాప్సీ మళ్ళీ మొదలెట్టేసింది (ఫొటోలు)

గుండె ఆ..గి పోతాందే: తాప్సీ మళ్ళీ మొదలెట్టేసింది (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటేనే అసలు దారుణం అన్నట్టు , అక్కడ టాలెంట్, నటనకంటే ఎక్స్ పోజింగ్ కే ఎక్కువ ప్రధాన్యం ఇస్తారన్నట్టు ఇటీవలే కొంచెం ఘాటైన స్టేట్ మెంట్ ఇచ్చింది తాప్సీ పన్ను. మోడలింగ్ నుంచి దక్షిణాది సినిమాల ద్వారానే పెద్ద తెరకు పరిచయం అయిన ఈ భామ ఇన్నేళ్లూ తనతో అర్థం లేని ఎక్స్ పోజింగ్ చేయించారని ఈ మధ్యనే వాపోయింది.

చాలానే మాట్లాడేసింది

చాలానే మాట్లాడేసింది

తన అందాలను తెరపై చూపించడంపై పెట్టిన శ్రద్ధ ఇక్కడి దర్శకులు తనలో నటిని చూపించలేకపోయారని, ఇకమీదట తనలో ఉండే నటిని చూస్తారనీ ఇలా చాలానే మాట్లాడేసింది. టాలీవుడ్ లో డబ్బులు ఎగ్గొట్టారనీ, బాలీవుద్ నుంచ్ఝి ఇక కదిలేదే లేదంటూ తాప్సీ బాలీవుడ్ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

నామ్ షబానా

నామ్ షబానా

కానీ బాలీవుడ్ లో టైం ఛేంజ్ అవడానికి పెద్దగా టైం పట్టదు. ఈ భామ నటించిన ఘాజీ అటాక్ సక్సెస్ అయినా.. తాప్సీకి దక్కిందేమీ లేదు. ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న నామ్ షబానా మూవీ బాక్సాఫీస్ దగ్గర చతికిలబడింది. అప్పుడు మళ్లీ సౌత్ సినిమాల్లో నటించేందుకు రెడీ అంటూ సిగ్నల్స్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు.

ఏషియాస్పా మేగజైన్ కోసం

ఏషియాస్పా మేగజైన్ కోసం

దీంతో మళ్లీ తన అందాల రూట్ లోకి వచ్చేసింది. తాజాగా ఏషియాస్పా మేగజైన్ కోసం తాప్సీ చేసిన ఫోటోషూట్ చూస్తే అవాక్కవాల్సిందే. ఈ మధ్య కాలంలో ఎన్నడూ కనిపించనంత గ్లామర్ గా ఆ మేగజైన్ కవర్ పేజ్ పై దర్శనం ఇచ్చింది ఈ భామ. గతంలో చెప్పిన టాలెంటూ, నటనా లాంటివన్నీ మళ్ళీ అటకెక్కించేసి ప్రదర్సణ మొదలెట్టేసింది.

అవకాశాలు లేకుండా పోయి

అవకాశాలు లేకుండా పోయి

స్కిన్ షో చేయనిదే టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా హీరోయిన్ల పరిస్థితి అంతే అనుకున్నట్టుంది. ప్రస్తుతానికి తనకు అవకాశాలు లేకుండా పోయిన సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీని ఈ ఘాటైన వ్యాఖ్యలతో అవమానించిన ఈ భామ ఇప్పుడు హిందీలో ఒక బోల్డ్ సినిమాకు సై అనడం విశేషం.

ఏక్తా కపూర్

ఏక్తా కపూర్

బోల్డ్ సినిమాలతో హిందీ తెరకు హీటెక్కిస్తున్న ఏక్తా కపూర్ సారధ్యంలో రూపొందే సినిమాలో తాప్సీ నటిస్తోంది. ఏక్తా సినిమాల్లో హీరోయిన్లు ఎంత హాట్ గా కనిపిస్తారో, బోల్డ్ గా ప్రవర్తిస్తారో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు తాప్సీ కూడా అలాగే కనిపించబోతోంది. కాకపోతే అన్నీ కథ కోసమే, స్క్రిప్ట్ డిమాండ్ మేరకే అలా చేయాల్సి వస్తోంది అంటూ కాకమ్మ కబుర్లు చెప్తోంది.

English summary
Taapsee Pannu was seen struck with a pose on the cover of a number of magazine and this time she has been over the said magazine Asia Spa Magazine
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu