For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమ ఉంటే ఇలాగే చంపేస్తారా? ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్‌పై ప్రముఖ హీరోయిన్ ఫైర్

|
Tapsee Pannu Targets Sandeep Reddy Vanga In Her Style || Filmibeat Telugu

'అర్జున్ రెడ్డి' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీని, 'కబీర్ సింగ్'తో యావత్ భారతదేశాన్ని తన వైపునకు తిప్పుకున్న దర్శకుడు 'సందీప్ రెడ్డి వంగా'. ఈ సినిమాతో అతడికి ఎంత మంచి పేరు వచ్చిందో.. అంత కంటే ఎక్కువ వివాదాల్లో ఇరుక్కున్నాడు. దీంతో సందీప్ రెడ్డి వంగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. దీనికితోడు ఇటీవల చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. దీంతో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది.

ఒక్క స్టేట్‌మెంట్‌తో విమర్శలు

ఒక్క స్టేట్‌మెంట్‌తో విమర్శలు

‘కబీర్ సింగ్' ప్రమోషన్‌లో భాగంగా సందీప్ రెడ్డి వంగా ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన సినిమాలో బూతు కంటెంట్ ఎక్కువైందన్న విమర్శలకు సమాధానం చెప్పాడు. ‘‘ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉంటే వాళ్లు తమ పార్ట్‌నర్‌ను కొడుతుంటారు. అనుమతి లేకుండానే ఏమైనా చేస్తారు'' అంటూ చెప్పుకొచ్చాడు.

విమర్శలు మొదలు

విమర్శలు మొదలు

సందీప్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఎంతో మంది హీరోయిన్లు, సినీ ప్రముఖులు దీనిపై కామెంట్లు చేస్తున్నారు. అందరికంటే ముందుగా సింగర్ చిన్మయి ఈ వీడియోపై స్పందించింది. సందీప్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఆ తర్వాత మరికొందరు ఆమెకు మద్దతుగా, సందీప్‌కు వ్యతిరేకంగా పోస్టులు చేశారు.

ఇప్పుడు తాప్సీ వంతు

సందీప్ రెడ్డిపై తాజాగా తాప్సీ విమర్శలు చేసింది. ఆమె ఓ చానెల్‌తో మాట్లాడుతూ ‘కబీర్ సింగ్' డైరెక్టర్‌పై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించింది. ‘‘ఇటీవల నాగ్‌పూర్‌లో ఓ హత్య జరిగింది. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న ప్రియుడు ఆమెను దారుణంగా చంపేశాడు. నిజంగా ప్రేమ ఉంటే ఇలాగే చంపేస్తారా..? నిజమైన ప్రేమ అంటే ఇదేనా..? నిజమైన ప్రేమ ఎప్పుడు ఇలాంటి పనులు చేయించదు.. కేవలం ప్రేమనే కోరుకుంటుంది'' అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది.

తాప్సీకి ఊహించని మద్దతు

తాప్సీకి ఊహించని మద్దతు

తాప్సీ చేసిన కామెంట్లకు ఊహించని స్థాయిలో మద్దతు లభిస్తోంది. సందీప్‌ను టార్గెట్ చేసి ఈమె ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, అందులో నిజముండడంతో చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఈ హీరోయిన్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. కేవలం అభిమానులే కాదు.. సెలెబ్రిటీలు కూడా ఆమె వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారు.

English summary
Tollywood Sensational Director Sandeep Reddy Vanga gave an entirely different and unconventional definition about love, B’Town people have been finding ways to troll him, not missing on any opportunity to get at him. Now, it’s Taapsee’s turn to troll him.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more