తాప్సి ఒక చెత్త నటి, చూడలేకపోతున్నాం.. సంచలన వ్యాఖ్యలు, అంతే ఘాటుగా!
సొట్ట బుగ్గల సుందరి తాప్సి బాలీవుడ్ కు వెళ్లి అదరగొడుతోంది. గ్లామర్ తో పాటు తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తుండడంతో తాప్సి విజయాలు అందుకుంటోంది. కానీ సోషల్ మీడియాలో తాప్సిపై ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. తాజగా సోషల్ మీడియా వేదికగా తాప్సికి చేదు అనుభవం ఎదురైంది. గతంలో తాప్సి పలు దక్షణాది చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది కూడా.

తాప్సి ఒక చెత్త నటి
సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలు సెలెబ్రెటీలకు తప్పేలా లేవు. బాలీవుడ్ లో తాప్సిపై ఏస్థాయిలో ప్రశంసలు కురుస్తున్నాయో అదే స్థాయిలో నెటిజన్ల నుంచి విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. తాప్సి ఒక చెత్త నటి అంటూ ట్రోలింగ్ మొదలైంది.

చూడలేకపోతున్నాం
తాప్సి పై కొందరు నెటిజన్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఆమె ఓక చెత్త నటి. చూడలేకపోతున్నాం. 2, 3 సినిమాలకు మించి ఎక్కువకాలం బాలీవుడ్ లో కొనసాగలేదు అంటూ కామెంట్స్ చేసారు. దీనిపై తాప్సి కూడా అంతే ఘాటుగా బదులిచ్చింది.

భరించకతప్పదు
నేను ఇప్పటికే మూడు సినిమాలు పూర్తి చేశా. మరో మూడు సినిమాలకు సైన్ చేశా. కాబట్టి కొంతకాలం మీరు నన్ను భరించక తప్పదు అంటూ తాప్సి సదరు నెటిజన్ కు రిప్లై ఇచ్చింది.

సినిమాలు బాగుండవు
తాప్సి నటించే సినిమాలు బాగుండవని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మీరు సినిమాలు చూడడంలో అభిరుచి మార్చుకోండి అంటూ తాప్సి రిప్లై ఇచ్చింది. తాప్సి ప్రస్తుతం తెలుగులో నీవెవరో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











