తన పెళ్లి గురించి తాప్సి ఆసక్తికర వ్యాఖ్యలు!
సొట్ట బుగ్గల సుందరి తాప్సి బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఝుమ్మంది నాదం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సి. తాప్సి కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలు తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. కొని చిత్రాలలో తాప్సి సెకండ్ హీరోయిన్ గా మాత్రమే పరిమితమైంది. తాప్సి ప్రస్తుతం బాలీవుడ్ నటిగా రాణిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాప్సి తన వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
డెమార్క్ కు చెందిన బ్యాట్మింటన్ ప్లేయర్ మాథిస్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. నేను ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఇవే ప్రశ్నలు అడుగుతున్నారు. అతడి గురించి అరా తీస్తూ నన్నెందుకు ప్రశ్నలు అడుగుతారు అని తాప్సి మండిపడింది. అతడేం స్టార్ క్రికెటర్ కాదు, వ్యాపారవేత్త కాదు అని తెలిపింది. ఇక నా పెళ్లి విషయం అంటారా.. నాకు పిల్లలు కావాలని అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటా అని తాప్సి క్లారిటీ ఇచ్చింది.

గతంలో బ్యాట్మింటన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా తాప్సి పూణే జట్టుకి కో ఓనర్ గా వ్యవహరించింది. ఆ సమయంలో డెన్మార్క్ ఆటగాడు మాథిస్ తో తాప్సి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











