ఆడలేనమ్మ మద్దెలమీద ఏడ్చిందట: టాలీవుడ్ పై ఇంకా తగ్గని తాప్సీ ఏడుపు
అసలు టాప్ నటి అన్న మాటకు అర్ధం ఏంటో తెలియడం లేదని.. ఇందుకోసం ఏమైనా స్పెషల్ గా ఎగ్జామ్స్ ఉంటే రాసేందుకు తాను సిద్ధమంటూ వెటకారం కూడా ఆడుతోంది తాప్సీ.
Recommended Video

నోటికొచ్చినట్టు మాట్లాడే దక్షిణాదిన పూర్తిగా అవకాశాలను పోగొట్టుకుంది. ఇప్పుడు బాలీవుడ్ మీద కూడా అలాగే అవాకులు చవాకులు పేలుతోందట! తనకు స్టార్ హీరోయిన్‌తో సమానమైన రేంజ్ ఉన్నా పెద్ద హీరోలెవరూ గుర్తించడం లేదు అంటూ ఓ బాంబు పేల్చింది. తనని గుర్తించడం లేదు అని బాధపడితే ఎవరూ తప్పు పట్టరు కానీ, తనకి తాను స్టార్ హీరోయిన్ బిరుదు ఇచ్చుకోవడమే బాగాలేదు అంటున్నారు బాలీవుడ్ జనాలు.

విజయాలు ఎక్కువగానే ఉన్నాయి
దక్షిణాది నుంచి నార్త్ కు వెళ్లిన వేరే ఏ హీరోయిన్ తో పోల్చినా అమ్మడికి విజయాలు ఎక్కువగానే ఉన్నాయి. అటు పెర్ఫామెన్స్.. ఇటు కమర్షియల్ మూవీస్ తో సత్తా చాటేస్తున్న తాప్సీ.. కొన్ని విషయాల్లో మాత్రం ఉడుకుమోతుతనం తగ్గించుకోలేకపోతోంది.

అనవసరంగా నోరుపారేసుకొని
తాప్సీకి అందమున్నంత బుర్ర ఉండదు అని గతం లో వచ్చిన విమర్శలని నిజం చేయాలనుకుంటుందో ఏమో గానీ తాప్సీ ఈ మధ్య అనవసరంగా నోరుపారేసుకొని భాలీవుడ్ కి కూడా దూరమయ్యేలాగా ఉంది. టాలీవుడ్ నుంచి బాలీవుద్ కి వెళ్ళి అక్కడ నాలుగు ఆఫర్లు రాగానే తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద నోరుపారేసుకుంది కాక, అదే మత్తులో దర్శకేద్రుడు రాఘవేంద్ర రావు మీద కూడా సెటైర్లు వేసింది.

సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక
సహజంగా కొన్ని హిట్స్ వచ్చిన తర్వాత ఓ స్టేటస్ సంపాదించుకున్నాక.. ప్రధానంగా సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక మనసులో నుంచి కొన్ని రకాల ఫీలింగ్స్ ను బయటకు పంపేస్తారు. రీసెంట్ గానే జుడ్వా2 మూవీతో బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ ను కూడా ఖాతాలో వేసుకున్న తాప్సీ పన్ను.. తనకు ఇంకా టాప్ యాక్ట్రెస్ అంటే అర్ధం తెలియదని.. అస్సలు ఆ మాటే తన కెరీర్ లో వినిపించడం లేదని చెబుతోంది.

వెటకారం ఆడుతోంది
అసలు టాప్ నటి అన్న మాటకు అర్ధం ఏంటో తెలియడం లేదని.. ఇందుకోసం ఏమైనా స్పెషల్ గా ఎగ్జామ్స్ ఉంటే రాసేందుకు తాను సిద్ధమంటూ వెటకారం కూడా ఆడుతోంది తాప్సీ. తనను ఎవరూ టాప్ హీరోయిన్ గా గుర్తించడం లేదన్నది ఈమె బాధ.

సౌత్ లో ఎక్కువగా ఫ్లాప్స్
పైగా సక్సెస్ లను బేస్ చేసుకుని ఇలా డిసైడ్ చేసేట్లు అయితే కనుక..తనకు సౌత్ లో ఎక్కువగా ఫ్లాప్స్ ఉండడంతో.. తన కెరీర్ లో వాటి వాటా ఎక్కువగా ఉంటుందని వాపోతున్న తాప్సీ.. టాప్ హీరోయిన్స్ పైనా.. సౌత్ పైనా తన అక్కసు బాహాటంగానే వెళ్లగక్కింది.


Click it and Unblock the Notifications











