twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను ఐరన్ లెగ్.. నటిస్తే సినిమాలు ఫ్లాప్.. అదో కుట్ర.. తాప్సీ

    నామ్ షబానా చిత్ర విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తాప్సీ తన బాలీవుడ్‌లోకి ప్రవేశించక ముందు, ఆ తర్వాత ఎదురైన అనుభవాలను ఫేస్‌బుక్‌లో పంచుకొన్నారు

    By Rajababu
    |

    బాలీవుడ్‌లో తాప్సీ పన్ను హవా జోరుగా కొనసాగుతున్నది. బేబీ, పింక్, ఘాజీ చిత్రాల తర్వాత తాప్సీ టాప్ హీరోయిన్ల రేసులో వచ్చింది. ప్రస్తుతం నామ్ షబానా అనే చిత్రంలో తాప్సీ నటిస్తున్నది. ఈ చిత్రాలకు ముందు తాప్సీ అంతగా గుర్తింపులేదు. చష్మే బద్దూర్ ‌చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఆమెకు సరైన సక్సెస్‌లు లభించకపోవడంతో లక్కీ గర్ల్‌గా ముద్ర పడలేదు. కానీ తాజాగా ఆమె నటించిన చిత్రాలు వరుస విజయాలు సాధించడంతో నిర్మాతలు తాప్సీ కోసం క్యూ కడుతున్నారు. నామ్ షబానా చిత్ర విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తాప్సీ తన బాలీవుడ్‌లోకి ప్రవేశించక ముందు, ఆ తర్వాత ఎదురైన అనుభవాలను ఫేస్‌బుక్‌లో పంచుకొన్నారు.

    అనుకోకుండా హీరోయిన్ అయ్యా..

    అనుకోకుండా హీరోయిన్ అయ్యా..

    కాలేజీలో చదివే రోజుల్లో పాకెట్ మనీ కోసం మోడలింగ్ రంగంలోకి ప్రవేశించాను. క్యాట్‌లో 88 శాతం మార్కులను స్కోర్ చేశాను. ఎంబీఏ‌లో చేరేందుకు నిర్ణయించుకొన్నాను. అప్పుడే సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. దాంతో నటిగా మారాను అని తాప్సీ చెప్పింది.

    ఐరన్ లెగ్.. అనేక ఆటుపోట్లు..

    ఐరన్ లెగ్.. అనేక ఆటుపోట్లు..

    సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత చాలా అటుపోట్లను ఎదుర్కొన్నాను. నేను నటించిన సినిమాలు సక్సెస్ సాధించకపోవడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. నేను నటిస్తే సినిమాలు ఫ్లాప్ అవుతాయనే రూమర్ ప్రచారమైంది. నేను నటించిన సినిమాల్లో హీరోలు, డైరెక్టర్ భాగస్వామ్యముంది. అయితే వారికి కాకుండా నాకు ఐరన్ లెగ్ పేరు రావడం చాలా బాధగా ఉండేది. అవన్నీ చూస్తే కుట్రలానే అనిపించేది.

    ఫెయిల్యూర్స్‌తో ప్రశ్నార్థకంగా కెరీర్

    ఫెయిల్యూర్స్‌తో ప్రశ్నార్థకంగా కెరీర్

    నేను నటించిన సినిమాలు ఆడకపోవడంతో నా రెమ్యునరేషన్ భారీగా కోత విధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ కారణాల వల్ల చాలా సినిమాల నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చాను. అప్పుడు నా కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. పింక్ విజయం తర్వాత నా పరిస్థితి చాలా మెరుగుపడింది.

    టాప్ హీరోయిన్లకే హీరోల సిఫారసు

    టాప్ హీరోయిన్లకే హీరోల సిఫారసు

    పింక్ సినిమాకు ముందు బాలీవుడ్‌లో హీరోలు నాతో నటించడానికి నిరాకరించే వారు. హీరోలు టాప్ హీరోయిన్లనే సిఫారసు చేసేవారు. దాంతో నిర్మాతలు నన్ను ఉన్నట్టుండి తొలగించేవారు. సరిగ్గా డబ్బులు కూడా ఇచ్చేవారు కాదు. అప్పుడు నా పరిస్థితి గందరగోళంగా ఉండేది.

    గ్లామర్ హీరోయిన్ కాను..

    గ్లామర్ హీరోయిన్ కాను..

    ఇతర హీరోయిన్ల మాదిరిగా నేను అంత గ్లామరస్ తారను కాను. కమర్షియల్ హీరోయిన్‌కు ఉండాల్సిన బాడీ కూడా లేదు. కానీ సినిమా అంటే చాలా ఇష్టపడుతాను. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సహనంతో ముందుకు వెళ్లాను. నేను మానసికంగా బలమైనదానిని, స్వతంత్ర భావాలు ఎక్కువ.

    అసభ్యంగా ప్రవర్తిస్తే.. లాగి కొట్టాను..

    అసభ్యంగా ప్రవర్తిస్తే.. లాగి కొట్టాను..

    ఢిల్లీలో ఒకసారి ఓ వ్యక్తి వెనుక నుంచి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతను ఎవరో అనేది కూడా చూడకుండా అతడి చేతిని పట్టుకొని మెలిపెట్టాను. లాగి పట్టి కొట్టాలనిపించింది. మహిళలతో తప్పుడుగా ప్రవర్తిస్తే చంపేయాలనిపిస్తుంది.

    పింక్, ఘాజీ తర్వాత తాప్సీ నటించిన నామ్ షబానా చిత్రం ఏప్రిల్ 31న

    పింక్, ఘాజీ తర్వాత తాప్సీ నటించిన నామ్ షబానా చిత్రం ఏప్రిల్ 31న

    విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, పృథ్వీరాజ్ సుకుమారన్, మనోజ్ బాజ్‌పేయి, అనుపమ్ ఖేర్, డానీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి శివం నాయర్ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే, శీతల్ భాటియా ఈ చిత్రానికి నిర్మాతలు. నీరజ్ పాండే కథతోపాటు, స్క్రీన్ ప్లేను అందించారు.

    English summary
    Taapsee Pannu bares her heart in a moving post on the traumatic experiences she has had in Bollywood so far.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X