తాప్సీ న్యూ రిలీజ్... ‘గేమ్ ఓవర్’ ప్రీ రిలీజ్ రివ్యూ

తాప్సి ప్రధాన పాత్రలో దర్శకుడు తమిళ అశ్విన్ శరవణన్ రూపొందించిన చిత్రం 'గేమ్ ఓవర్'. వై నాట్ స్థూడియోస్ పతాకంపై ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 14న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో తాప్సీ స్వప్న అనే వీడియో గేమ్ డిజైనర్‌గా నటించింది.

తెలుగు, తమిళంలో ఇప్పటికే సెలబ్రిటీల కోసం స్పెషల్ షోలు ప్రదర్శించారు. వారి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు రాని ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో ఈచిత్రాన్ని తెరకెక్కించినట్లుగా చర్చించుకుంటున్నారు. దర్శకుడు అశ్విన్ శరవణన్, రచయిత కావ్య... 'గేమ్ ఓవర్' కథను వీడియో గేమ్ తరహాలో విభిన్నంగా మలిచినట్లు చెబుతున్నారు.

విభిన్నమైన కథతో ‘గేమ్ ఓవర్’

విభిన్నమైన కథతో ‘గేమ్ ఓవర్’

మనం వీడియో గేమ్ ఆడుతున్నపుడు కిల్ అయినప్పుడల్లా లైఫ్ లైన్ ఉపయోగించుకుని గేమ్ కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఇదే తరహాలో ఈ చిత్రంలో తాప్సీకి విలన్ లైఫ్ లైన్ ఇస్తాడని, ఇందులో ఆమె వృత్తికి, గతానికి లింక్ పెట్టి ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో అద్భుతంగా కథను ముందుకు నడిపించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని సెన్సబుల్ ఇష్యూలను టచ్ చేసినట్లు తెలుస్తోంది.

స్క్రీన్ ప్లే మేజర్ హైలెట్

స్క్రీన్ ప్లే మేజర్ హైలెట్

హీరోయిన్ తాప్సీ, వినోదిని వైద్యనాథన్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, ఆద్యంతం ట్రిప్పీగా సాగే కథనం ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపే విధంగా ఉందని చెబుతున్నారు. ఈ చిత్రంలో హీరో అంటూ ఎవరూ లేరు. అశ్విన్, కావ్య రాసిన స్క్రీన్ ప్లే ఈ చిత్రాకి హీరోగా చెబుతున్నారు.

సామాజిక అంశాలను టచ్ చేసిన దర్శకుడు

సామాజిక అంశాలను టచ్ చేసిన దర్శకుడు

ఈ సినిమా ద్వారా దర్శకుడు అశ్విన్ శరవణన్ దేశంలోని పలు సామాజిక అంశాలను కూడా టచ్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కొన్ని అంశాలను ఆలోచనాత్మంగా రూపొందించినట్లు సమాచారం. విభిన్నమైన చిత్రాలు కోరుకునే వారికి ‘గేమ్ ఓవర్' తప్పకుండా నచ్చుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

గేమ్ ఓవర్

గేమ్ ఓవర్

ఈ చిత్రానికి సినీ విమర్శకుల నుంచి మంచి స్పందన వస్తుంది. మరికొన్ని గంటల్లో పూర్తి రివ్యూ మీ ముందుకు తెస్తాం.

ఈ చిత్రానికి సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్ , ఎడిటర్: రిచర్డ్ కెవిన్, రచన: అశ్విన్ శరవణన్,కావ్య రాంకుమార్, మాటలు: వెంకట్ కాచర్ల, ఛాయా గ్రహణం: ఎ.వసంత్, ఆర్ట్: శివశంకర్ , కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.కె.నందిని, పోరాటాలు: 'రియల్' సతీష్, సౌండ్ డిజైనర్: సచిన్ సుధాకరన్, హరిహరన్ (సింక్ సినిమా), స్టిల్స్: ఎమ్.ఎస్.ఆనందం, పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న, వై నాట్ స్టూడియోస్ టీమ్: కంటెంట్ హెడ్: సుమన్ కుమార్, డిస్ట్రిబ్యూషన్ హెడ్: కిషోర్ తాళ్లూరు, బిజినెస్ ఆపరేషన్స్: ప్రణవ్ రాజ్ కుమార్, సహ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర, నిర్మాత: ఎస్.శశికాంత్, దర్శకత్వం: అశ్విన్ శరవణన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X