తాప్సి గేమ్ ఓవర్.. ట్విట్టర్ రివ్యూ: అసలు ఆట ఇప్పుడే మొదలైంది
హీరోయిన్ తాప్సి పన్ను ముఖ్యపాత్రలో దర్శకుడు తమిళ అశ్విన్ శరవణన్ రూపొందించిన చిత్రం 'గేమ్ ఓవర్'. వై నాట్ స్థూడియోస్ పతాకంపై ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 14 వ తేదీన తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో తాప్సీ స్వప్న అనే వీడియో గేమ్ డిజైనర్‌గా నటించింది.
తెలుగు, తమిళంలో ఇప్పటికే సెలబ్రిటీల కోసం స్పెషల్ షోలు ప్రదర్శించారు. అలాగే జూన్ 13 న ఈ చిత్రాన్ని విదేశాల్లో విడుదల చేశారు. అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వారి వారి ట్వీట్స్ చూస్తుంటే సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయం అని తెలుస్తోంది. దర్శకుడు అశ్విన్ శరవణన్, రచయిత కావ్య... 'గేమ్ ఓవర్' కథను వీడియో గేమ్ తరహాలో విభిన్నంగా మలిచినట్లు చెబుతున్నారు. అందులో కొందరి అభిప్రాయలు మీ కోసం..
తాప్సి పన్ను చించేసింది
గేమ్ ఓవర్ సినిమా చూస్తే వీడియో గేమ్ చూస్తున్నట్లే అనిపించింది. మన ప్రాణాలను కోల్పోయే వరకు ఆట అంతం కాదని సందేశమిచ్చింది గేమ్ ఓవర్ మూవీ. దేశంలోని పురుషాధిక్యతను పారద్రోలేలా మహిళలు కృషి చేయాలని గేమ్ ఓవర్ ఇచ్చిన సందేశం అద్వితీయం.
అసలు ఆట ఇప్పుడే మొదలైంది
గేమ్ ఓవర్ సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాం. అసలు ఆట ఇప్పుడే మొదలైంది.. మహిళల విలువలను బాగా వర్ణించారు.
యూ గైస్ రెడీగా ఉండండి
గేమ్ ఓవర్ సినిమాలో మహిళా ప్రాధాన్యతను చూపిస్తూ పెద్ద పీట వేశారు. యూ గైస్ రెడీగా ఉండండి మహిళలతో పోటీ పడి ప్రశంసలు అందుకోవడానికి. మీరెన్ని చేసినా మహిళలదే పైచేయి. వాట్ ఏ పర్‌ఫార్‌మెన్స్ !
తాప్సి యూ ఆర్ బ్రిలియెంట్.. మరచిపోలేక పోతున్నా
గేమ్ ఓవర్ సినిమాలో హీరోయిన్ తాప్సి అదరగొట్టేసింది. యూ ఆర్ బ్రిలియెంట్ తాప్సి మామ్. గేమ్ ఓవర్ స్టోరీని మరచిపోలేక పోతున్నా. సినిమా చూసి బయటకొచ్చాక ఇప్పటికీ నా మైండ్ లో అదే మెదులుతోంది. హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి.
తాప్సి తప్ప ఎవ్వరినీ ఉహించుకోలేము
గేమ్ ఓవర్ సినిమాలో బ్రిలియెంట్ గా పర్‌ఫార్మ్ చేసింది తాప్సి. కారెక్టర్ లో ఒదిగిపోయింది. ఈ కారెక్టర్ లో తాప్సిని తప్ప ఇంకెవ్వరినీ ఉహించుకోలేము. చిత్రంలోని అన్ని రోల్స్ పర్ఫెక్ట్ గా డిజైన్ చేశాడు దర్శకుడు.
బాలీవుడ్ సీనియర్లు కూడా చేయలేరు
గేమ్ ఓవర్ సినిమాలో తాప్సి చూపిన అభినయం అద్భుతం. ఈ అభినయాన్ని బాలీవుడ్ లోని సీనియర్ హీరోయిన్లు కూడా చూపలేరు. కనీసం ఇందులో సగం కూడా వారి వల్ల కాదు.
చాలా రోజులకు స్పందిస్తున్నా..
ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ సినిమాకు నేను స్పందించడం లేదు. కానీ చాలా రోజుల తర్వాత స్పందించాల్సి వచ్చింది. డైరెక్టర్ టేకింగ్, తాప్సి రోల్ సూపర్. ఫెంటాస్టిక్ మూవీ.


Click it and Unblock the Notifications











