కరెంటు బిల్లు చూసి తాప్సీ షాక్, గుండెలు బాదుకొంటున్న సినీతారలు.. వారికి ఎంత వచ్చిందంటే!
లాక్‌డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా షాకులిస్తున్నాయి. గత మూడ నెలల కాలంలో ప్రాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా బోర్డుల లీలలు సామాన్య ప్రజలకే కాకుండా ప్రముఖులకు కూడా కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే సాధారణ ప్రజలు తమకు వచ్చిన విద్యుత్ బిల్లులను సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
మంత్రులు, ఎమ్మెల్యేలు, విద్యుత్ అధికారులు దృష్టికి తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలో సినీ నటి తాప్సీ పన్నుతోపాటు పలువురు ప్రముఖులు తమ కరెంటు బిల్లుల బాధలను చెప్పుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తాప్సీకి విద్యుత్ బిల్లు ఎంత వచ్చిందంటే..

టీవీ నటి రేణుకా సహానికి బిల్లు ఎంతంటే
టెలివిజన్ నటి రేణుక సహాని తన విద్యుత్ బిల్లు గురించి ట్వీట్ చేస్తూ.. నాకు మే 9వ తేదీన మాకు రూ.5510 బిల్లు వచ్చింది. జూన్‌లో బిల్లు చూస్తే గుండె ఆగినంత పనైంది. మాకు 18000 రూపాయల బిల్లు రావడం షాక్ తగిలినంత పనైంది. కేవలం నెల రోజుల బిల్లులో ఇంత వ్యత్యాసమా అని రేణుక సహాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సౌమ్య టాండన్ విద్యుత్ బిల్లు
సౌమ్య టాండన్ తన విద్యుత్ బిల్లులపై షాక్‌ను వ్యక్తం చేస్తూ సెటైర్ కూడా వేశారు. ముంబైలో ఎలక్ట్రిసిటి బోర్డుకు ట్వీట్ చేస్తూ.. నా నెలసరి సగటు విద్యుత్ బిల్లు రూ.8000. కానీ జూన్ బిల్లు మాత్రం పేలిపోయేలా వచ్చింది. నా నెలకు నా బిల్లు 28 వేల రూపాయలు. బహుశా లాక్‌డౌన్ సర్‌చార్జి విధించారేమో అని ఆమె ట్వీట్ చేశారు.

టీవీ నటులు పులక్రిత్.. రాజకృష్ణ మీనన్
ఇక పులక్రిత్ సామ్రాట్, రాజకృష్ణ మీనన్ లాంటి సినీ ప్రముఖులకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎప్పుడూ వచ్చే కరెంట్ బిల్లు కంటే మూడు రెట్లకు మంచి విద్యుత్ బిల్లు వచ్చింది. నాకు 30 వేల రూపాయల విద్యుత్ బిల్లు వచ్చిందని పులక్రిత్ సామ్రాట్ పేర్కొన్నారు. బాంద్రా విద్యుత్ అధికారులు సరిగా యూనిట్లను లెక్కించి ఉండరని అనుకొంటాను అని రాజకృష్ణ అన్నారు.

హీరోయిన్ అమీరా దస్తర్‌కు
హీరోయిన్ అమీరా దస్తర్ కూడా తన కరెంట్ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేశారు. నా ఫ్లాట్‌లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉండటం లేదు. కానీ నా ఫ్లాట్ బిల్లు మాత్రం మాటల్లో చెప్పలేనంతగా వచ్చింది. నా ట్వీట్‌కు స్పందించిన ఎవరైనా అధికారి ఫోన్ నంబర్ ఇస్తే వారితో నా కరెంట్ బిల్లు గురించి మాట్లాడుతాను అని అన్నారు.

తాప్సీ బిల్లులు ఎంతంటే
ఇక తాప్సీ తన కరెంట్ బిల్లు గురించి ట్వీట్ చేస్తూ.. నా ఇంటి విద్యుత్ బిల్లు ఏప్రిల్‌లో రూ.4390, మే నెలలో 3850 రూపాయలు వచ్చింది. ఇక జూన్ విషయానికి వస్తే 36 వేల బిల్లు వేసి పంపించారు. ఆ రకంగా బిల్లు రావడం చూసి నా గుండె ఆగినంత పనైంది అంటూ తాప్సీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

విద్యుత్ బోర్డుపై తాప్సీ సెటైర్లు
ఇక బిల్లు గురించి తాప్సీ స్పందిస్తూ.. గత మూడు నెలల్లో నా ఇంట్లో నేను ఎలాంటి వస్తువులను వాడాను లేదా కొత్తగా ఎలాంటి గృహ పరికరాలు కొన్నాను అనే విషయంపై ఆలోచించడం మొదలుపెట్టాను. చివరికి నా ఆలోచనలకు ఎలాంటి విషయాలు తట్టలేదు. అందుకే మీరు నాకు ఎలాంటి విద్యుత్‌ను సరఫరా చేశారు. దానికి ఇంత బిల్లు అవుతుందా? అంటూ తాప్సీ ఓ సెటైర్ సంధించారు.


Click it and Unblock the Notifications











