'నా బాడీలో ఏ పార్ట్ అంటే ఇష్టం'.. నాకైతే అదే.. ఆకతాయికి తాప్సి దిమ్మతిరిగేలా!
పలు సందర్భాల్లో హీరోయిన్లు నెటిజన్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ని పట్టించుకోరు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం పట్టించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పలు సందర్భాల్లో హీరోయిన్ తాప్సి సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కు గురైంది. ప్రతి సారి తనని విమర్శించే వారికీ తాప్సి ధీటుగా సమాధానం ఇస్తోంది. తాజాగా ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా తాప్సి గురించి అసభ్యంగా కామెంట్ చేశాడు. అతడికి తాప్సి దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వడంతో అభిమానులు తాప్సిని ప్రశంసిస్తున్నారు.

నీ బాడీ పార్ట్స్ అంటే చాలా ఇష్టం
ఓ నెటిజన్ తాప్సి గురించి ట్వీట్ చేయడం, దానికి తాప్సి ఘాటుగా సమాధానం ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాప్సి.. నీ బాడీ పార్ట్స్ అంటే చాలా ఇష్టం అని కామెంట్ పెట్టాడు. ఇంత అసభ్యంగా కామెంట్ చేసిన అతడికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకుందో ఏమో కానీ సింపుల్ గా, అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ఈ రిప్లై తో తాప్సి సమయ స్ఫూర్తి మరోమారు బయటపడిందని నెటిజన్లు అంటున్నారు.
నీకు ఏ పార్ట్ ఇష్టం
నా బాడీ పార్ట్స్ అంటే ఇష్టమా.. నేను కూడా నా శరీర భాగాలని ఇష్టపడతాను.. నీకు ఏ పార్ట్ అంటే ఇష్టం. నాకు మాత్రం అన్నింటికన్నా మస్తిష్కం అంటే ఇష్టం అని తెలిపింది. తనకు బుద్ది ఉన్న వాళ్లంటే ఇష్టం అని తాప్సి ఇలా ఘాటుగా అతడికి కౌటర్ ఇచ్చింది. మరొకసారి అతడు వల్గర్ కామెంట్స్ చేయకుండా నోరు మూయించింది.

బులెట్ దెబ్బ కన్నా వెయ్యి రెట్లు
బులెట్ దెబ్బకన్నా తాప్సి రిప్లై వెయ్యి రెట్లు అదిరిపోయింది. ఆ వేదవకు కనీసం అతడి ఫోటో పెట్టె ధైర్యం కూడాలేదు అని ఓ నెటిజన్ తాప్సిని ప్రశంసించాడు. తాప్సి మరోమారు తన కూల్‌నెస్ ని బయటపెట్టింది మరికొందరు ప్రశంసిస్తున్నారు.

బాలీవుడ్ చిత్రాలతో
ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అక్షయ్ కుమార్ నటిస్తున్న మిషన్ మంగళ్ చిత్రమో తాప్సి అవకాశం దక్కించుకుంది. విభిన్న చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది కానీ గ్లామర్ పాత్రలు మాత్రం తాప్సికి దక్కడం లేదు. తాప్సి టాలీవుడ్ కు పూర్తిగా దూరం కావడంతో ఇక్కడ బాగా సన్నగిల్లాయి. తాప్సి చివరగా తెలుగులో నటించిన చిత్రం నీవెవరో.


Click it and Unblock the Notifications











