రజనీ సార్‌ను అవమానించలేదు, తాప్సీ వివరణ
హైదరాబాద్: హీరోయిన్ తాప్సీ ఇటీవల టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో చేసిన కామెంట్స్ తమిళ నాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆమె తన ఇంటర్వూలో రజనీకాంత్ కంటే అజిత్‌కి పెద్ద అభిమానిని అంటూ వ్యాఖ్యలు చేసింది. దీంతో రజనీకాంత్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. తమ హీరోను అవమానించేలా మాట్లాడతావా అంటూ ఆమెపై ఫైర్ అయ్యారు.
ఈ పరిణామాల నేపథ్యంలో తాప్సీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ తాను రజనీసార్ గురించి అస్సలు మాట్లాడలేని, నా వ్యాఖ్యలను సదరు పత్రిక వారు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చింది. 'నా వ్యాఖ్యల తప్పుగా రాసారు. టైమ్స్ ఇంటర్య్యూలో Thala కంటే Ajithకి పెద్ద అభిమానిని అని చెప్పాను. కానీ వారు నా వ్యాఖ్యలను Thalaivar(Rajinikanth) అని తప్పుగా అర్థం చేసుకున్నారు' అని తాప్సి వివరణ ఇచ్చింది.

Thala అనేది తమిళ సినిమా ఇండస్టీలో అజిత్ నిక్ నేమ్. మనం చిరంజీవిని 'మెగాస్టార్' అని ఎలా పిలుచుకుంటామో, అక్కడ అజిత్‌ను Thala అని పిలుస్తారు. అదే విధంగా రజనీకాంత్‌ను Thalaivar అని ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు.
ఇక తాప్సీ సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం ఆమె తన సెకండ్ బాలీవుడ్ ప్రాజెక్ట్ 'రన్నింగ్ షాది డాట్ కామ్' లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. దీంతో పాటు రాఘవ రారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ముని 3: గంగా' అనే తమిళ, తెలుగు ద్విబాషా చిత్రంలో కూడా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











